Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మన్మధుడు 2... రీమేక్ నా?

మన్మధుడు 2... రీమేక్ నా?

మన్మధుడు 2... హీరో నాగార్జున ప్రస్తుతం చేస్తున్న సినిమా. డైరక్టర్ రాహుల్ రవీంద్రన్ టేకప్ చేసిన ఈ ప్రాజెక్టు మన్మధుడు సినిమాకు సీక్వెల్ అని టాక్ వుంది. చాలా తక్కువ టైమ్ లో, చకచకా షూటింగ్ ఫినిష్ చేస్తారు ఈ సినిమా అని ఇండస్ట్రీ బోగట్టా. అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా ఇంకో విషయం తెలుస్తోంది.

ఈ సినిమా టోటల్ గా అంటే యాజ్ ఇట్ ఈజ్ గా ఓ హాలీవుడ్ సినిమాకు రీమేక్ అని వినిపిస్తోంది. రాహుల్ సూచించిన ఓ సినిమా నాగ్ కు నచ్చడంతో అలా ప్రొసీడ్ అయిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రైట్స్ కూడా తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది.

ఇదిలావుంటే మన్మధుడు 2 షూటింగ్ ను జస్ట్ రెండు మూడునెలల్లో ముగించి, ఈ ఏడాదే రామరాజు సినిమాను కూడా ఫినిష్ చేయాలని నాగ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటి మధ్యలో బిగ్ బాస్ షో కూడా నాగ్ చేసే అవకాశం వుంది.

సీమ సింహం ఎవరు? ఫిరాయింపుల ప్రభావం ఎంత?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?