ఎప్పుడో 30దాటేసింది. పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు ఫేస్ చేసి విసుగెత్తిపోయింది. దీనికి తోడు ఓ క్రికెటర్ తో ప్రేమాయణం అంటూ ఆమధ్య రూమర్లు. ఇలాంటి టైమ్ లో శ్రియ పెళ్లికి సంబంధించి హాట్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఓ రష్యన్ కుర్రాడిని శ్రియ పెళ్లాడబోతోందనేది ఆ వార్త.
కొన్నాళ్లుగా ఓ రష్యన్ తో శ్రియ చాలా సన్నిహితంగా ఉంటోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. శ్రియ కోసం ఆకుర్రాడు 2-3 సార్లు ముంబయి వచ్చాడట. శ్రియ కూడా ఓసారి రష్యా వెళ్లి వచ్చిందట. వీళ్లిద్దరి మధ్య వ్యవహారం చాలా దూరం వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక పెళ్లి ఒక్కటే బ్యాలెన్స్ అని టాక్. ఈపుకార్లకు మరింత ఊతమిస్తూ, ప్రస్తుతం శ్రియ రష్యాలోనే ఉంది.
అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి నెలలో రాజస్థాన్ లో వీరి పెళ్లి అట్టహాసంగా జరగనుంది. అంతా ఓకే కానీ, ఆరష్యా వ్యక్తి ఎవరనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం తెలుగులో గాయత్రి, వీరభోగవసంతరాయలు సినిమాల్లో నటిస్తోంది శ్రియ.