ఒకే నెలలో రెండు నాని సినిమాలకు క్లాప్

ప్రస్తుతం టాలీవుడ్ లో చకచకా పెర్ ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు చేస్తున్న హీరో అంటే నాని పేరే వినిపిస్తుంది. ఎంసిఎ విడుదలై నెల దాటింది. కృష్ణార్జునయుద్ధం ముగింపు దశకు చేరుకుంది. Advertisement వెంటనే…

ప్రస్తుతం టాలీవుడ్ లో చకచకా పెర్ ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు చేస్తున్న హీరో అంటే నాని పేరే వినిపిస్తుంది. ఎంసిఎ విడుదలై నెల దాటింది. కృష్ణార్జునయుద్ధం ముగింపు దశకు చేరుకుంది.

వెంటనే రెండు సినిమాలకు ఒకేసారి శ్రీకారం చుడుతున్నాడు. ఒకటి నాగ్ కాంబినేషన్ లో శ్రీరామ్ ఆదిత్య డైరక్షన్ లో చేయబోయే సినిమా. రెండవది తిరుమల కిషోర్ డైరక్షన్ లో చేయబోయే సినిమా.

ఈ రెండు సినిమాలకు కూడా మార్చి నెలాఖరులోనే క్లాప్ కొట్టేస్తారు. మూడు నాలుగు రోజులు తేడాలో ఓపెనింగ్ లు వుంటాయి. ఆ తరువాత రెండు సినిమాలు కూడా కాస్త గ్యాప్ లో సమాంతరంగా షూట్ జరిపేసుకుంటాయి. అంటే ఒక విధంగా 2019ఫస్ట్ హాఫ్ ముగిసే సరికే నాని సినిమాలు మూడు పూర్తవుతాయన్నమాట.

ఏడెనిమిది కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకునే హీరో ఇంత ఫాస్ట్ గా ఏడాదికి అయిదారు సినిమాలు చేయడం అంటే నిజంగా ఇండస్ట్రీకి మంచిదే.