నాగ్-వర్మ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా ముంబాయ్ లో లాంగ్ షెడ్యూలు జరుపుకుంటోంది. తొలిసారి ఈసినిమాకు సంబంధించి ఓ స్టిల్ ను నాగ్ తన ట్విట్టర్ పేజ్ లో వదిలాడు.
ఓ పాప భయం భయంగా చూస్తుండగా, పక్కన నాగ్ తుపాకీని ఎవరికో గురి పెట్టిన స్టిల్ అది. సాధారణంగా సినిమా సినిమాకు కొత్త లుక్ ట్రయ్ చేసే నాగ్, ఈసారి ఆ వ్యవహారం మీద పెద్దగా దృష్టి పెట్టినట్లు లేదు. జస్ట్ కాజువల్ లుక్ లో వున్నాడు.
ఈ స్టిల్ మీద ట్వీట్ లు, రీట్వీట్ లతో ఆసక్తికరమైన కామెంట్లే దొర్లుతున్నాయి ట్విట్టర్ లో. అన్నింటికన్నా హైలైట్ ఏమిటంటే, ఈస్టిల్ తో వచ్చే కిక్క్ మాటేమో కానీ సినిమా బాగా రాకపోతే, తనను తన్నడానికి మాత్రం నాగ్ ఫ్యాన్స్ రెడీగా వున్నారంటూ రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేయడం. అంటే నాగ్ తో సినిమా వ్యవహారం మీద ఆ మాత్రం క్లారిటీ వుందన్న మాట. ఆ క్లారిటీ వుంటే సినిమా బాగానే రావడానికి అవకాశం వుంటుంది.
ఇదిలావుంటే త్వరలో సినిమా టైటిల్, రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేస్తా అంటున్నారు ఆర్జీవీ. ముంబాయిలో నెల రోజుల షూటింగ్ తో సినిమా దాదాపు ఓ కొలిక్కి వచ్చేస్తుందట. అంటే సమ్మర్ కాకపోయినా, పోస్ట్ సమ్మర్ లోనైనా నాగ్ సినిమా రావడం పక్కాఅనే అనుకోవాలి.