సమంత టీజర్ వస్తోందహో..

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ఎలా వుంటాడు.. ఆ వైనం ఏమిటి? అన్న టీజర్ ఆ మధ్య బయటకు వచ్చింది. మంచి అప్లాజ్ వచ్చింది. కానీ ఆ టీజర్ లో ఎంత వెదికినా ఎక్కడా…

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ ఎలా వుంటాడు.. ఆ వైనం ఏమిటి? అన్న టీజర్ ఆ మధ్య బయటకు వచ్చింది. మంచి అప్లాజ్ వచ్చింది. కానీ ఆ టీజర్ లో ఎంత వెదికినా ఎక్కడా సమంత కనిపించనే లేదు. దాంతో దర్శకుడు సుక్కూ ఇలా ఎందుకు చేసాడబ్బా? అని సమంత అభిమానులు తెగ ఫీలయ్యారు.

అందుకే సమంత అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యేలా ఓ ఇరవై సెకెండ్ల టీజర్ ను రెడీ చేసారు. రంగస్థలంలో సమంత ఎలా వుండబోతోంది. ఆమె పాత్ర ఏమిటి అన్నది జస్ట్ ఎట్ ఎ గ్లాన్స్ 20సెకెండ్లలో చూపించబోతున్నారు.

ఈ టీజర్ ఈవారంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుంది. బహుశా శుక్రవారం వచ్చినా రావచ్చు. రామ్ చరణ్ టీజర్, సమంత టీజర్ రెండూ కలిపి చూస్తే, రంగస్థలం మీద ఓ క్లారిటీ వచ్చే అవకాశం వుంటుందేమో? దర్శకుడు సుకుమార్ ప్రెస్టీజియస్ గా తన టేస్ట్ కు తగినట్లు ముస్తాబు చేస్తున్న రంగస్థలం మార్చి నెలాఖరులో విడుదలవుతుంది.