ప్రత్యేకించి కాస్ట్యూమ్స్ కోసం డిజైనర్స్‌ని పెట్టుకున్నా అప్పుడప్పుడూ సెలబ్రిటీలు బుక్కయిపోతుంటారు. చెత్త డ్రస్సులనీ, కాపీ కొట్టిన డ్రస్సులేసుకొచ్చారనీ హీరోయిన్లపై కామెంట్లు పడ్తుంటాయి. బాలీవుడ్ మీడియాలో ఈ పోకడ చాలా ఎక్కువ. ఫలానా టైమ్‌లో ఫలానా హీరోయిన్ ఫలానా డ్రస్ వేసిందనీ.. ఆ డ్రస్‌ని ఫలానా హీరోయిన్ ఫలానా సందర్భంలో కాపీ కొట్టిందనీ కథనాల్ని తెరపైకి తెస్తుంటుంది బాలీవుడ్ మీడియా.
గోవా బ్యూటీ ఇలియానా విషయంలో తాజాగా అలాంటి కథనమే ఒకటి తెరపైకొచ్చింది. హీరోయిన్ సోనాల్ చౌహన్ చాన్నాళ్ళ క్రితం కన్పించిన ఓ కాస్ట్యూమ్‌ని పోలి వుండే కాస్ట్యూమ్‌లో తాజాగా ఇలియానా దర్శనమిచ్చింది. అంతే. సోనాల్ చౌహన్‌ని కాపీ కొట్టిన ఇలియానా.. అంటూ కామెంట్స్ షురూ అయ్యాయి. వ్యవహారం ఇలియానా దాకా వెళ్ళేసరికి, ఆమెకు కోపమొచ్చింది.
‘సిల్లీ థింగ్స్.. హాలీవుడ్ ట్రెండ్స్‌ని మనం ఫాలో అవుతుంటాం.. సినిమా కథలే ఒక్కోసారి కాపీ కథలుగా విమర్శల పాలవుతుంటాయి.. కాస్ట్త్యూమ్స్ అయినా అంతే. దాన్ని సీరియస్‌గా తీసుకోను నేను.. ఆ డ్రస్‌లో నేనెలా వున్నానో చెప్పండి..’ అంటూ ఇలియానా తనదైన స్టయిల్లో కాపీ కాస్ట్యూమ్ కథనాలపై స్పందించిందిట.