మహేష్‌కి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించిన మహేష్‌బాబు సినిమాలన్నీ పెద్ద హిట్ అయ్యాయి. మధ్యలో మాస్‌ని మెప్పించడానికో లేదా ప్రయోగాలకి ప్రయత్నించో మహేష్ కొన్ని పరాజయాలు కొని తెచ్చుకున్నాడు. గత ఏడాది అతనికి పీడకలగా మిగిలిపోయింది.
రెండు భారీ డిజాస్టర్లు అతని దూకుడుకి కళ్లెం వేసాయి. అందుకే తన తదుపరి చిత్రాల విషయంలో మహేష్ అస్సలు రిస్క్ తీసుకోవడం లేదు. తన సినిమాలకి పెద్ద బలమైన ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పిస్తూ ఇతర వర్గాలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ‘శ్రీమంతుడు’ పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రమట.
ఇందులో యాక్షన్ పార్ట్ ఉంటుంది కానీ… ప్రధానంగా ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్‌గా నిలుస్తాయని తెలిసింది. అలాగే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నటించడానికి కూడా మహేష్ మొగ్గు చూపుతున్నాడు. అతని ‘బ్రహ్మోత్సవం’ కథ సైతం ఫ్యామిలీ సెంటిమెంట్స్ ప్రధానంగా సాగేదేనట. ముందు తన స్ట్రెంగ్త్‌పై కాన్సన్‌ట్రేట్ చేసి, తర్వాత తన పరిధి పెంచుకోవడానికి మహేష్ చూస్తున్నట్టున్నాడు. మంచి ప్లానింగే!