నిర్మాతల గుండెల్లో రైళ్లు

9వ తేదీ శుక్రవారం ఇంక రెండు రోజులే వుంది. ఆ రోజు కొన్ని చిన్న సినిమాలు షెడ్యూల్ అయి వున్నాయి. అదే విధంగా 23,24,25 తేదీలకు మరి కొన్ని మీడియం సినిమాలు షెడ్యూల్ అయి…

9వ తేదీ శుక్రవారం ఇంక రెండు రోజులే వుంది. ఆ రోజు కొన్ని చిన్న సినిమాలు షెడ్యూల్ అయి వున్నాయి. అదే విధంగా 23,24,25 తేదీలకు మరి కొన్ని మీడియం సినిమాలు షెడ్యూల్ అయి వున్నాయి. మధ్యలో ఐ సినిమా వుంది. అయితే సమస్య ఏమిటంటే, గోపాల గోపాల ఎప్పుడు వస్తుంది అన్నది? 9న విడుదల అన్నది అసాధ్యం కావచ్చు. 

ఎందుకంటే ఇంకా సెన్సారు వుంది. ఈ రోజు అది అయిపోయినా, క్యూబ్ తదితర పనులు వుంటాయి. అందువల్ల 10 లేదా 11న వస్తుందా అన్నది ఓ అనుమానం. ఐ తో సమానంగా 14న వచ్చే సాహసం చేయకపోవచ్చు. 

మరి  బై బ్యాడ్ లక్ ఈ రెండూ కాకుంటే, 22,23ల్లో పడితే పరిస్థితి ఏమిటి? పటాస్ లాంటి కాస్త పెద్ద సినిమాలు, పెసరట్, లేడీస్ అండ్ జంటిల్ మెన్ లాంటి చిన్న సినిమాలు అప్పుడే వున్నాయి. గోపాల గోపాల డేట్ తెలియక చాలా మంది నిర్మాతలు కిందామీదా పడుతున్నారు.