Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శిరీష్ తో ఆ నిర్మాత సినిమా

శిరీష్ తో ఆ నిర్మాత సినిమా

ఓ సక్సెస్ కొట్టి నిర్మాతగా తనేంటో ప్రూవ్ చేసుకోవాలన్నది మధుర శ్రీధర్ రెడ్డి ప్రయత్నం. డైరక్టర్ గా కూడా ట్రయ్ చేసారు. నీహారిక-నాగశౌర్య కాంబినేషన్ లో ఒకమనసు లాంటి మాంచి క్లాస్ సినిమా తీసినా విజయం వరించలేదు.

వంశీ లాంటి సీనియర్ డైరక్టర్ తో ఫ్యాషన్ డిజైనర్ తీసినా ఫలితం దక్కలేదు. ఆ తరువాత గ్యాప్ వచ్చింది. ఆ మధ్య ఓ అమెరికా వెళ్లాలనే కుర్రాళ్ల కథతో ఓ చిన్న సినిమా చేసారు. ఇంకా విడుదల కావాల్సి వుంది.

ఇప్పుడు మళ్లీ సినిమా ప్లాన్ లు చేస్తున్నారట. ఈ సినిమా కోసం అల్లు శిరీష్ ను హీరోగా తీసుకోవాలి అని ప్రయత్నిస్తున్నట్లు బోగట్టా. ఇప్పటికే మధుర శ్రీధర్ ఈ సినిమా విషయమై అల్లు శిరీష్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అటు నుంచి సమాధానం ఇంకా ఏమీ రాలేదు. యెస్ అనేస్తే, మధుర శ్రీధర్ మళ్లీ కాస్త వార్తల్లో కనిపించే సినిమా ఒకటి చేస్తారన్నమాట.

ఈ రెండు సినిమాలు కాక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ బయోపిక్ చేస్తామని ఆయన గతంలో ప్రకటించారు. అది ఇంకా పెండింగ్ లో వుంది. ఆ ప్రాజెక్టు రాబోయే ఎన్నికల ముందు వుంటుందా? వుండదా? అన్నది చూడాలి మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?