మంచి కథని ఎంచుకోవడం కూడా ఓ కళే. దర్శకుడు కథ చెబుతున్నప్పుడు.. అది తెరపై ఎలా ఉంటుంది? అని ఊహించడం అందరికీ అబ్బే విద్య కాదు. అది తెలీకే కొంతమంది హీరోల చేతుల్లోంచి మంచి కథలు చేజారిపోతుంటాయి. ఈ విషయంలో అల్లు శిరీష్‌ని బ్యాడ్ లక్ వెంటాడుతోంది.
`శ్రీరస్తు శుభమస్తు` కంటే శిరీష్‌కి రెండు కథలు వినిపించాడు పరశురామ్. అవి రెండూ శిరీష్‌కి నచ్చలేదు. చివరికి 'శ్రీరస్తు శుభమస్తు' సెట్ అయ్యింది. అలా.. శిరీష్ వదిలేసిన కథలో ఒకటి `గీత గోవిందం`.మరి అందులో ఏం నచ్చలేదో… 'నో' అనేశాడు. దాన్ని వేరే హీరో తో తీస్తే వంద కోట్ల సినిమా అయ్యింది. శిరీష్ వదిలేసిన ఆ రెండో కథ 'సర్కారువారి పాట' అని టాక్.
ఓ బ్యాంకు మేనేజరు కొడుకు… అప్పు ఎగ్గొట్టిన ఓ బడా బాబు చెవులు మెలేసి, వడ్డీతో సహా ఎలా వసూలు చేశాడన్నది కథ. ఇదీ శిరీష్ కాదనన్నాడు. దాన్నే మహేష్‌కి పెద్ద స్కేల్‌లో చెప్పి ఒప్పించాడు. 'నేను వదిలేసిన కథ మహేష్ చేస్తున్నాడు' అనే సంతృప్తి తప్ప.. శిరీష్‌కి ఏమీ మిగల్లేదు. 'శిరీష్ నో అన్న కథ మహేష్ చేస్తున్నాడా' అని మహేష్‌ఫ్యాన్స్ బెంగ పడిపోనక్కరలేదు..గీతగోవిందం లాగే ఇదీ బ్లాక్ బస్టర్ అవుతుందేమో?