‘శివ’ కు ‘తిరు’ తో కొత్తగా వుందా?

కొరటాల శివ కు తొలి రెండు సినిమాలకు పెద్ద ప్లస్ పాయింట్ సినిమాటోగ్రాఫర్ మాథి. కొరటాల శివ అద్భుతమైన స్క్రిప్ట్ తయారుచేసి చేతికిస్తే, చాలు అన్నీ తానై చూసుకునేవాడు అని ఇండస్ట్రీ ఇన్ సైడ్…

కొరటాల శివ కు తొలి రెండు సినిమాలకు పెద్ద ప్లస్ పాయింట్ సినిమాటోగ్రాఫర్ మాథి. కొరటాల శివ అద్భుతమైన స్క్రిప్ట్ తయారుచేసి చేతికిస్తే, చాలు అన్నీ తానై చూసుకునేవాడు అని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్. దాదాపు నటీనటుల నుంచి నటన విషయం పక్కన పెడితే, ఏ సీన్ ఎలా ఎలివేట్ చేయాలో, లొకేషన్లు ఎలా వుండాలో, లైటింగ్ మూడ్ ఇలా దాదాపు తొంభై శాతం పని మాథి పూర్తి చేసేవాడట. కానీ ఏం కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో ఏమో, మూడో సినిమాకు తిరున్నావక్కరసు వచ్చి జాయిన్ అయ్యారు.

తిరున్నావక్కరసు కూడా చిన్నా చితకవాడేం కాదు. తమిళ, మళయాల, హిందీల్లో బోలెడు సినిమాలు చేసాడు. వీటిల్లో అనేక సూపర్ హిట్ లు, భారీ సినిమాలు వున్నాయి. స్క్రీన్ ప్లే రైటింగ్ లో కూడా అనుభవం వుంది. కానీ వెంటనే సింక్ కావడం అంటే అంత సలువు కాదు కదా? అందుకే జనతా గ్యారేజ్ సినిమా అనుకున్న టైమ్ కన్నా కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటోందని తెలుస్తోంది. తీసిన షాట్లు కూడా మళ్లీ మళ్లీ రీ షూట్ చేస్తున్నారని టాక్. అజయ్ మీద ఇది వరకు తీసిన ఒకటి రెండు షాట్లు నిన్న మొన్న మళ్లీ షూట్ చేసారట.

నిజానికి కేరళ నుంచి రావడంతో టాకీ షూట్ పార్ట్ అయిపోతుందనుకున్నారు. కానీ ఇప్పటికీ ఇంకా హైదరాబాద్ లో వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. మరి ఇంతకీ మాథి లేని లోటు ఏమన్నా కనిపిస్తుందో? తిరు బాగానే కవర్ చేస్తారో చూడాలి.

ఇదిలా వుంటే జనతా గ్యారేజ్ విడుదలకు ఇంకా ఇరవై రోజుల వరకు టైమ్ వుంది. అయితే ఓవర్ సీస్ డెలివరీ లెక్క వేసుకుంటే గట్టిగా 15 రోజులకు కాస్త అటుగానే టైమ్ వుంది. అందువల్ల కాస్త స్పీడ్ గానే వర్క్ చేయాల్సి వుంది.