cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శివనిర్వాణ-నాని ఫిక్స్

శివనిర్వాణ-నాని ఫిక్స్

మజిలీ సినిమా తరువాత దర్శకుడు శివనిర్వాణ చేయబోయే సినిమా ఫిక్స్ అయిపోయినట్లే. హీరో నాని తో జరిగిన వరుస స్టోరీ సిట్టింగ్ లు దాదాపు పూర్తయ్యాయి. ఇంకో ఒక్క సిట్టింగ్ వుంది. ఫ్యామిలీ ఎమోషన్, కాస్త యాక్షన్ కలిసిన కథ ను లాక్ చేయడంపై చిన్న చిన్న డిస్కషన్లు జరుగుతున్నాయి.

నాని ప్రస్తుతానికి ఒకే చేసిన సినిమా ఇది ఒక్కటే. ఇంద్రంగంటి వి సినిమాలో నెగిటివ్ టచ్ వున్నక్యారెక్టర్ చేస్తున్నారు. సైకో కిల్లర్ గా కనిపిస్తాడు కానీ, సినిమా చివరకు వెళ్లే సరికి అది రివెంజ్ అన్న టచ్ ఇచ్చి, పాజిటివ్ సెంటిమెంట్ వచ్చేలా కథ వుంటుందని టాక్ వినిపిస్తోంది. వి సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. అది ఉగాదికి విడుదల చేస్తారు.

మజిలీ సినిమాను నిర్మించిన సాహునే ఈ సినిమాను కూడా నిర్మిస్తారు. ప్రస్తుతం చేస్తున్న, ఇంద్రగంటి డైరక్షన్ లోని  వి సినిమా పూర్తి కాగానే నాని ఈ సినిమాను స్టార్ట్ చేస్తారు.
ఫాదర్-సన్-ఫ్యామిలీ లాంటి ఎమోషన్లు పవర్ ప్యాక్డ్ పెట్టి ఈ స్క్రిప్ట్ ను తయారు చేసినట్లు తెలుస్తోంది.