నిర్మాత ఎమ్ ఎస్ రాజు అంటే హీరో ప్రభాస్ కు ప్రత్యేకమైన అభిమానం. ఆయన నిర్మించిన వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ లోనే పెద్ద మలుపు. ఇప్పుడు ప్రభాస్ పెద్ద హీరో. ఎమ్ ఎస్ రాజు సినిమాలు తీయడం ఆపేసారు. ఆయన తన కొడుకు సుమంత్ అశ్విన్ ను హీరోగా నిలబెట్టే పనిలో బిజీగా వున్నారు. ఆ ప్రాసెస్ లోనే హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాను తీసారు. కొణిదెల నీహారిక కథానాయిక. ఈ సినిమాను తీసుకెళ్లి ప్రభాస్ కు అనుబంధం వున్న యువి క్రియేషన్స్ చేతిలో పెట్టారు.
ప్రభాస్ తనకు ఎమ్ ఎస్ రాజు అంటే వున్న అభిమానంతో ఇప్పుడు ఈ సినిమా మీద ప్రత్యేక శ్రద్ద పెట్టారు. కోటి ముఫై లక్షలు కేవలం పబ్లిసిటీ ఆయన తన యువి క్రియేషన్స్ సంస్థ నుంచి ఖర్చు చేస్తున్నారు. అంతే కాకుండా యువి వంశీ సినిమాను మొత్తం క్వాలిటీ చెక్ చేసారట.
జూలైలో సరైన డేట్ ను చూసి హ్యాపీ వెడ్డింగ్ ను విడుదల చేస్తారు. విజయవాడ అబ్బాయి, హైదరాబాద్ అమ్మాయిల మధ్య జరిగే ప్రేమ, బ్రేక్ అప్, పెళ్లి అన్నది సినిమా లైన్. ఇందుకోసం రెండు వేరు వేరు ఇళ్ల సెట్ లు కూడా వేసారు. టోటల్ గా సినిమా కలర్ ఫుల్ గా వుండి, మాంచి పబ్లిసిటీతో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.