సాయి ధరమ్ తేజ్ తో సుబ్బు దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా సోలో బతుకే సో బెటరు. ఈ సినిమాకు ఇప్పటికే కొంత బజ్ వచ్చింది. పైగా ఇటీవలే సాయి ధరమ్ తేజ్ పెద్ద హిట్ ఇచ్చి వున్నాడు. దాంతో సోలో బతుకే సినిమాను అవుట్ రేట్ కు తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ హక్కులు ఇవ్వమని బేరాలు మొదలయ్యాయి.
యువి ప్లస్ దిల్ రాజు కలిసి 17 కోట్లకు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు అడుగుతున్నారు. అయితే ఇవ్వాలా?వద్దా? అన్న మీమాస కొనసాగుతోంది. ఈ మీమాంసకు రెండు కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి రెగ్యులర్ బయ్యర్ల సెటప్ అన్నది ఈ రోజుల్లో కీలకంగా మారింది. ఇది లేక చాలా సంస్థలు ఇబ్బంది పడి, మెల మెల్లగా సెటప్ చేసుకుంటున్నాయి.
ఆ విధంగా బివిఎస్ఎన్ ప్రసాద్ సంస్థకు కూడా ఓ సెటప్ వుంది. తొలి ప్రేమ కు దాన్ని దూరం చేసుకున్నారు. మళ్లీ మజ్ఞు ను దిల్ రాజు కొనకపోవడంతో వాళ్ల దగ్గరకు వెళ్లారు. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాకు వాళ్లను దూరం చేసుకోవాలి. పైగా నైజాం-వైజాగ్ తాము డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలని ప్రసాద్ భావిస్తున్నారు. ఈస్ట్ ను ఎప్పుడో అనిల్ సుంకరకు మాటిచ్చారు.
ఇలాంటి నేపథ్యంలో ఈ రోజు చిన్న మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు యువి/దిల్ రాజుకు ఇవ్వాలా వద్దా అన్నది డిసైడ్ అవుతుంది.