నేడే ఎన్టీఆర్ 30 ప్రకటన

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నది ఈ ప్రకటన కోసమే. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వుంటుందని తెలుసు. అయితే అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. పైగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మీద…

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నది ఈ ప్రకటన కోసమే. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వుంటుందని తెలుసు. అయితే అధికారికంగా ఇప్పటి వరకు ప్రకటన రాలేదు. పైగా ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మీద బిజీగా వున్నారు. జూలై నుంచి ఫ్రీ అయిపోతారని వేరే సినిమాలు చేసుకోవడానికి రాజమౌళి సై అన్నారని వార్తలు అయితే వున్నాయి. కానీ అవీ ధృవీకరణ కాలేదు.

ఇలాంటి నేపథ్యంలో సినిమాను అధికారికంగా ప్రకటిస్తే, ఫ్యాన్స్ కు ఫుల్ హ్యాపీనే. ఇలాంటి ప్రకటన నేటి సాయింత్రమో తప్పితే రేపో రాబోతోంది. హారిక హాసిని-ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కాంబినేషన్ లో ఈ సినిమా వుంటుంది. ప్రస్తుతానికి కేవలం కాంబినేషన్, నిర్మాతల పేర్లు మాత్రమే ప్రకటిస్తారు. మిగిలిన విషయాలు ఏవీ ప్రకటించరు. ఆఖరికి థమన్ పేరు కూడా ప్రకటించరు.

తరువాత తరువాత ఒక్కొక్కటీ ఫిక్స్ చేసినపుడు వాటంతట అవి బయటకు రావడం తప్ప వేరుగా ప్రకటనలు వుండవు. థమన్ మ్యూజిక్ డైరక్టర్ గా ప్రకాష్ ఆర్ట్ డైరక్టర్ గా మాత్రం ఫిక్స్ అవుతారని తెలుస్తోంది. థమన్ ఫుల్ ఫామ్ లో వుండడం, గతంలో ఇదే కాంబినేషన్ మంచి హిట్ కావడంతో మరో ఆలోచన వుండదు. అలాగే ఆర్ట్ డైరక్టర్ ప్రకాష్ పేరుకు ఆల్టర్ నేటివ్ కూడా లేకపోవచ్చు.

రష్మికని దారుణంగా ఆడేసుకున్నారు