Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సౌతాఫ్రికా మోడ‌ల్‌తో నాగ్‌

సౌతాఫ్రికా మోడ‌ల్‌తో నాగ్‌

మ‌న మ‌న్మధుడు నాగార్జున సౌతాఫ్రికా న‌టి గాబ్రియెల్లాతో జోడీ క‌ట్టాడు. అంతేకాదు పారిస్‌లో ఆ సుంద‌రితో దిగిన ఫొటోల‌ను త‌న ఫేస్‌బుక్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేశాడు. అత్యాధునికంగా అద‌రగొడుతున్న  స‌ద‌రు పొడుగుకాళ్ల అందం ప‌క్కన డీసెంట్ లుక్‌లో క‌నిపిస్తున్న నాగ్‌.. డిఫ‌రెంట్ పిక్చర్ అంద‌రినీ అట్రాక్ట్ చేసేలా ఉంది. 

ఇంత‌కీ ఈ ఫొటో వెనుక క‌ధ ఏమిటంటే...కొంత‌కాలంగా పారిస్‌లోని అంద‌మైన లొకేష‌న్ల‌లో  షూటింగ్ జ‌రుపుకుంటున్న పివిపి సినిమాలో నాగార్జున, త‌మిళ హీరో కార్తి, త‌మ‌న్నాలు న‌టిస్తున్నారు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శక‌త్వంలో ఏక కాలంలో తెలుగు త‌మిళ భాష‌ల్లొ ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమాలోని ఒక పాత్రకు గాను సౌతాఫ్రికా మోడ‌ల్ గాబ్రియెల్లాను తీసుకున్నార‌ట‌. 

కొత్తా పాత లేకుండా అంద‌రితో ఇట్టే క‌లిసిపోయే నాగ్ ఆ విదేశీ సుంద‌రికీ మాంచి దోస్త్ అయిపోయిన‌ట్టున్నాడు. పారిస్ సిటీలో ఆమెతో దిగిన ఈ ఫొటోను త‌న ఫేస్ బుక్ అకౌంట్లో అప్‌లోడ్ చేశాడు. అంతేకాకుండా ఆమె వివ‌రాలు కూడా తెలిపాడు. గ‌తంలో ఈ సినిమాకు సంబంధించి వ‌చ్చిన షూటింగ్ స్టిల్స్ అభిమానులను అల‌రించాయి. ఇప్పుడు ఫారిన్ అందం కూడా తోడ‌వ‌డంతో రానున్న స్టిల్స్ మ‌రింత ఆక‌ట్టుకోవ‌డం ఖాయం అనిపిస్తోంది. ఇంత‌కీ ఈ గాబ్రియెల్లా ఎవ‌రి ప‌క్క‌న చిందేయ‌బోతోంది? మ‌న నాగ్‌తోనా? త‌మిళ కార్తితోనా? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?