జ‌నవరి నుంచి ‘స్పిరిట్’!

పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్, వెయ్యి కోట్ల మార్కెట్. అయినా కూడా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయడం అన్నది ఒక్కడే ఒక్కడు బాహుబలి ప్రభాస్ కే చెల్లింది. ఇప్పుడు కూడా సెట్…

పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్, వెయ్యి కోట్ల మార్కెట్. అయినా కూడా ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయడం అన్నది ఒక్కడే ఒక్కడు బాహుబలి ప్రభాస్ కే చెల్లింది. ఇప్పుడు కూడా సెట్ మీద రాజాసాబ్, కల్కి 2 వున్నాయి. హను రాఘవపూడి ఫౌజ్ స్టార్ట్ చేసారు. అంటే మూడు సినిమాలు. సెట్ మీద వున్నాయి. 2025 లో రెండు సినిమాలు అయితే పక్కాగా వస్తాయి. ఇవన్నీ ఇలా వుంటే మరో సిక్స్ మంత్స్ లో మరో సినిమా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

యానిమల్ సినిమాలో సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ వంగా డైరక్షన్ లో తయారయ్యే స్పిరిట్ సినిమాను జ‌నవరి నుంచి స్టార్ట్ చేయాలనే డిస్కషన్లు సాగుతున్నాయి. సందీప్ వంగా దాదాపుగా స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారు ఈ మూడు నాలుగు నెలల్లో కాస్టింగ్, టెక్నికల్ టీమ్ ను ఫిక్స్ చేసుకుంటారు. జ‌నవరి నుంచి షెడ్యూళ్లు వేసే డిస్కషన్లు జ‌రుగుతున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కొద్ది రోజులుగా రాజా సాబ్ షూట్ జ‌రుగుతోంది. ప్రభాస్ వరుసగా కనుక ఓ 40 నుంచి 50 రోజులు డేట్లు ఇస్తే రాజా సాబ్ రెడీ అయిపోతుంది. అందువల్ల బహుశా జ‌నవరి నాటికి రాజాసాబ్ ను ఓ కొలిక్కి తెచ్చి, స్పిరిట్ కు శ్రీకారం చుట్టే అవకాశం వుందని తెలుస్తోంది.

సందీప్ వంగా సినిమా అంటే మామూలుగా వుండదని ఇప్పటికే ప్రూవ్ అయింది. అలాంటి సందీప్ వంగా ప్రభాస్ ను పోలీస్ పాత్రలో చూపిస్తే ఇంకే రేంజ్ లో వుంటుందో అని ఫ్యాన్స్ చాలా ఇంట్రస్ట్ గా ఎదురు చూస్తున్నారు.

6 Replies to “జ‌నవరి నుంచి ‘స్పిరిట్’!”

  1. షాహిద్ కపూర్ మార్కెట్ ను 3 టైమ్స్, ranbeer kapoor market ను 2 టైమ్స్..!! ఇది డెఫినేట్ గా 2000 crores మూవీ..!!

Comments are closed.