ఆయన కేంద్ర మంత్రి. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో గెలిచాడు. మోడీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు. ఆయనకు రెండు పదవులు ఇచ్చారు. ఒకటి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ శాఖ సహాయ మంత్రి. మరోటి టూరిజం మంత్రి. రెండూ ముఖ్యమైన పదవులే. కేంద్ర మంత్రి పదవి వచ్చినందుకు మరొకరైతే బాగా సంతోషపడేవారే. ఎగిరి గంతేసేవారే.
కానీ ఈయన మాత్రం మంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచి నిద్ర పోవడం లేదు. తనను మంత్రి పదవి నుంచి తీసేస్తే బాగుంటుంది అనుకుంటున్నాడు. తనకు చదువు రాదా? చేసే కెపాసిటీ లేదా? రెండూ ఉన్నాయి. కానీ …ఆయన మనసు సినిమాల మీద ఉంది.
ఎస్ …ఆయన సినిమా హీరో. తెలుగు కాదులెండి. మలయాళం హీరో. మామూలు హీరో కాదు. సూపర్ స్టార్. ఆయన తెలుగువారికి కూడా పరిచయమే. పేరు సురేష్ గోపీ. 1965 నుంచి సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన నటించిన కొన్ని మలయాళం సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు సాధించాడు. నటుడే కాకుండా గాయకుడు కూడా. సినిమాల్లో సోలో అండ్ డ్యూయెట్స్ కూడా పాడాడు.
రెండు తెలుగు సినిమాల్లో డైరెక్టుగా నటించాడు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిసూర్ నుంచి గెలిచాడు. బీజేపీకి కేరళలో హోల్డ్ ఉండాలి కాబట్టి ఈయనకు మంత్రి పదవి ఇచ్చాడు మోడీ. కానీ పదవి ఇచ్చినప్పటి నుంచి తాను సినిమాల్లో నటించలేకపోతున్నానని బెంగ పెట్టుకున్నాడు. నటిస్తున్న సినిమాలు కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని కమిట్ అయినవి ఉన్నాయి. అన్ని కలిపి 20 నుంచి 22 సినిమాల వరకు ఉన్నాయట.
అర్ధమవుతోంది కదా సురేష్ గోపీ ఎంత బిజీ హీరోనో. గతంలో ఈయన మంత్రి పదవి తీసుకోనని అన్నాడు. మళ్ళీ మనసు మార్చుకొని తీసుకున్నాడు. ఇప్పుడేమో మంత్రి పదవి అనే జైలు నుంచి వెళ్ళిపోయి సినిమాల్లో నటించాలని తహతహలాడిపోతున్నాడు. సినిమాల్లో నటించకపోతే తాను బతకలేనని అంటున్నాడు. తనను మంత్రి పదవి నుంచి తీసేసినా బాధపడనని పైగా సంతోషపడతానని చెబుతున్నాడు.
ఇప్పటికీ తనకు మంత్రి పదవి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదన్నాడు. కేంద్ర మంత్రిగా ఉంటూనే సినిమాల్లో నటించడానికి హోమ్ మంత్రి అమిత్ షా ను పర్మిషన్ అడిగాడట. తను నటించాల్సిన సినిమాల లిస్టు ఆయనకు ఇస్తే తీసి పక్కన పడేశాడట. నాయకత్వానికి విధేయుడిగా ఉండాలని హితబోధ చేశాడట. ఈ మంత్రి పదవి త్రిసూర్ ప్రజల కోసమని సురేష్ గోపీ చెబుతున్నాడు. మరి సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉంది కాబట్టి మంత్రి పదవికి రిజైన్ చేస్తే సరిపోతుంది కదా.
సినిమా హీరోలతో వచ్చిన గొడవే ఇది. సినిమాలను వదులుకోలేరు. పదవిని వదిలిపెట్టలేరు. ఒకప్పుడు ఎన్టీఆర్ కూడా సీఎంగా ఉంటూనే సొంత సినిమాల్లో నటించాడు. విమర్శలు ఎదుర్కొన్నాడు. చిరంజీవి రాజకీయాల్లో ఉన్నంత కాలం సినిమాల జోలికి పోలేదు. రాజకీయాలు విరమించుకున్న తరువాత సినిమా రంగాన్ని పదేళ్ళపాటు మిస్ చేసుకున్నానని అన్నాడు.
ఇప్పుడు ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సినిమాలు మూడో నాలుగో ఉన్నాయి. ఈయన ఓ పార్టీకి అధినేతే కాకుండా కీలక బాధ్యతల్లో ఉన్నాడు. గతంలోనే వైసీపీ పవన్ ను చెడుగుడు ఆడుకుంది. ఇప్పుడు సినిమాల్లో నటిస్తే తీవ్ర విమర్శలు చేయడం ఖాయం.
అందులోనూ పూర్తి చేయాల్సిన సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి వాటిని సగంలో వదిలేస్తే నిర్మాతలకు బతుకు బస్టాండ్ అవుతుంది. వారంలో రెండు రోజులు షూటింగ్ లో పాల్గొంటానని కొంతకాలం కిందట అన్నాడు. మరి ఏం ఆలోచిస్తాడో చూడాలి.
నువ్వు సురేష్ బుజం మీద నుంచి పవన్ ని షూట్ చేయాలనుకునే ప్రయత్నం ఆపు. పవన్ చాల క్లియర్ గ వున్నాడు ఆంధ్ర భవిష్యత్తు కోసం ఏమి చెయ్యాలో. నిన్న జరిగిన పంచాయితీ రాజ్ సమావేశాలు వ్యవస్థ లో ఒక పెను మార్పు, దేశం లోనే ప్రధమం. దీన్ని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునే అవకాశం లేకపోలేదు. దాని మీద రాయి మనసుంటే.
Mari intyiko udyogam yekada??????
Call boy jobs available 8341510897
vc available 9380537747
Manaki vunadu oka Lucha..padavi kavali Cinema kavali..malli Chese Edava panini Q cheyakudadhu..cheste kopam vachestundi..
దయ చేసి చెడుగుడు, నిప్పులు చెరగడం అనే మాటలు ఆపండి.
ఇలాగే నిప్పులు చెరిగి చెరిగి ఎక్కడ పోసాము అనుకుని మీ నిక్కరు లోనే పోసుకున్నారు. ఇప్పుడు సమ్మగా బర్నాల్ రాసుకుంటున్నారు.
నిర్మాణాత్మక విమర్శలు చేయండి. ఆవు కథ మాదిరి అన్నిటిలోకి PK ను తీసుకురాకండి.
అన్న పార్టీ పవన్ ని చెడుగుడు ఆడుకుంది, పవనేమో అన్న పార్టీ ని చితక్కొట్టాడు. ఇలాంటి ఎలివేషన్స్ ఇచ్చే అన్నని ముంచేశారు
“గతంలో వైసిపి పవన్ ని చెడుగుడు ఆడుకుంది. ఇప్పుడు సినిమాల్లో నటిస్తే తీవ్ర విమర్శలు చేయడం ఖాయం”. నువ్వు రాయాలనుకున్నది ఈ రెండు సెంటెన్స్ లు మాత్రమే దాని కొరకు ఒక ఆర్టికల్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఆపుతావ్ రా నీ ఏడుపు, నీ బ్రతుకు చెడ తూ..
జనం పట్టించుకోరు
Manthri padhavi vadhu annee vallu evaru vunnaru
Pawankalyan illanti nijayithi vunna pannulu cheyadu variki padhavi pichi