అప్పుడు సూపర్ అన్నారు.. ఇప్పుడు ట్రోలింగ్

నిజంగా ఇది దారుణమైన విషయం. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది. నార్త్ బెల్ట్ లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ మాటకొస్తే, తెలుగు వెర్షన్…

నిజంగా ఇది దారుణమైన విషయం. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్టయింది. నార్త్ బెల్ట్ లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఆ మాటకొస్తే, తెలుగు వెర్షన్ కంటే, హిందీ వెర్షన్ కే ఎక్కువ వసూళ్లు వచ్చాయి. అంతలా కల్కి సినిమాకు బ్రహ్మరథం పట్టారు హిందీ ప్రేక్షకులు.

అయితే అప్పుడు థియేటర్లలో సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులే, ఇప్పుడు ఓటీటీలో కల్కి సినిమాను తిట్టడం విడ్డూరం. దీనంతటికీ కారణం అర్షద్ వార్సి వివాదం. రీసెంట్ గా ప్రభాస్ పై వార్సి విమర్శలు చేశాడు. కల్కి సినిమాలో ప్రభాస్ జోకర్ లా ఉన్నాడంటూ ఆక్షేపించాడు.

అర్షద్ విమర్శలపై టాలీవుడ్ లో దుమారం చెలరేగింది. ప్రభాస్ ఫ్యాన్స్, అతడ్ని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అతడి ఫొటోలు మార్ఫింగ్ చేసి మరీ ట్రోలింగ్ షురూ చేశారు. దీనికితోడు నాని, శర్వానంద్, సుధీర్ బాబు లాంటి హీరోలు కూడా అర్షద్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ వస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ఉత్తరాది నుంచి అర్షద్ కు అనుకూలంగా ఓ బ్యాచ్ తయారైంది. నానిపై ఓ రేంజ్ లో వాళ్లు ట్రోల్ చేస్తున్నారు. ఓవైపు ఇదంతా జరుగుతున్న టైమ్ లో ఓటీటీలోకి వచ్చింది కల్కి. దీంతో తమ కోపం మొత్తాన్ని ఓటీటీ వెర్షన్ పై చూపిస్తున్నారు బాలీవుడ్ జనం.

కల్కి సినిమాలో ప్రభాస్ క్లిప్స్ కట్ చేసి, బాలీవుడ్ సి-గ్రేట్ హీరోలతో పోలుస్తున్నారు. ప్రభాస్ హెయిర్ స్టయిల్, గడ్డంపై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. కల్కి సినిమా చెత్తగా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. కల్కి సినిమాలో అక్కడక్కడ కామెడీ చేశాడు ప్రభాస్. ఆ క్లిప్స్ ను అర్షద్ కామెడీ క్లిప్స్ తో కంపేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తమ్మీద ఓటీటీలోకి వచ్చిన కల్కి సినిమాను ఎంజాయ్ చేయడం మానేసి, ఓ బ్యాచ్ అచ్చంగా ఇలా ట్రోలింగ్ చేయడం కోసం వాడుకోవడం బాధాకరం.

25 Replies to “అప్పుడు సూపర్ అన్నారు.. ఇప్పుడు ట్రోలింగ్”

  1. Oka Reddy director teesina average sollu movie. Only Aswini dutt marketing strategies and Prabhas presence saved the movie. Same project Rajamouli chetulloki vellinte result vere level lo vundedi.

  2. Oka Reddy director teesina average movie. Only Aswini dutt marketing strategies and Prabhas presence saved the movie. Same project Rajamouli chetulloki vellinte result vere level lo vundedi.

  3. నాకు మాత్రం ఈ సినిమా చూసి బయటకు రాగానే దీనెమ్మ తెలుగు వాడు అనేవాడు మీసం మెలి తిప్పే సినిమా తీసాడు అని పించింది నేను స్వతహగా బాలయ్య బాబు అభిమానిని కానీ తెలుగు సినిమా బాగుండాలి అది ప్రభాస్ సినిమా ఐన ఎన్టీఆర్ సినిమా ఐన పవన్ కళ్యాణ్ సినిమా ఐన ఎవరిది ఐన దాని ఐడెంటిటీ తెలుగు సినిమా

  4. movie antha goppga emi led. kaani manavaallani support cheyyalsina avasaram vundi. chetta bollywood enppudu south talent ni encourage, accept cheyyadu. chetta vedavalu.

    dialogues and dubbing chaalaa daarunam gaa vunnai. Hindi dubbing movie choostunattu vundi.

  5. Kalki lo Prabhas di comedian role…unnadi ante ulukenduku. Nijanni nirbhayam ga oppukovali..

    Kalki lo hero Amitab… Deenni evaraina kandinchalanukunte ippudu movie OTT lo undi..chusi debate cheyandi…

  6. Yes correct. Modati nundi naaku nachaledu movie. Emundi andulo. Prabhas roke waste. Theatre lo 3 dsy 10 members mathrame vunnaru. Emi kanipinchadu. Dailogues ardam kaavu. Thala pagilindi.. Movie nundi vachaka

  7. నాగ్ అశ్విన్ సుడి బాగున్నట్టుంది, కాబట్టే ఆడింది. ఆసలు ఎంవుంది సినిమాలో?

Comments are closed.