హుందా రాజకీయం అంటే ఇదేనా?

అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడం అనే లౌక్య నీతి కేవలం రాజకీయాలలో మాత్రమే కాదు.. ఏ రంగంలో నైనా త్వర త్వరగా రాణించి పైకి ఎగబాగాలనుకునే వాళ్ళు అనుసరించే మార్గం ఇది! రాజకీయాలలో…

అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకోవడం అనే లౌక్య నీతి కేవలం రాజకీయాలలో మాత్రమే కాదు.. ఏ రంగంలో నైనా త్వర త్వరగా రాణించి పైకి ఎగబాగాలనుకునే వాళ్ళు అనుసరించే మార్గం ఇది! రాజకీయాలలో ఇలాంటి ఆత్రుత చాలా ఎక్కువగా ఉంటుంది! ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన స్థానిక సంస్థల నాయకులను తమ పార్టీల్లోకి చేర్చుకునే విషయంలో తెలుగుదేశం అనుసరిస్తున్న ధోరణి చూస్తే ఇదే విధంగా కనిపిస్తుంది.

మొన్నటికి మొన్న విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవసరమైనన్ని ఫిరాయింపులు జరిగే అవకాశం కనిపించకపోవడంతో హుందా రాజకీయాలు మాత్రమే చేద్దాం అని ఒక ఆడంబరపు ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఆ తరువాత దానిని మరిచిపోయినట్లుగా ఉంది!

తాజాగా మాచర్ల మునిసిపల్ కార్పొరేషన్ లో ఏకంగా 16 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఈ పరిణామాన్ని ముందే అంచనా వేసి అక్కడి చైర్మన్ ఏసోబు వారం కిందటే రాజీనామా చేశారు. తాజాగా తెలుగుదేశంలో చేరిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పోలూరు నరసింహారావును చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హుందా రాజకీయాలు అంటే ఇవేనా చంద్రబాబు గారూ అనే ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతుంది.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని గరిష్టంగా తమలో కలిపేసుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. కొన్నిచోట్ల వారి ప్రలోభాలు, తాయిలాలు వర్కౌట్ అవుతున్నాయి. విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోగలిగే స్థాయిలో ఫిరాయింపులు చేపట్టాలని తొలుత ప్రయత్నించారు గాని నగరపాలికలో కొందరు కార్పొరేటర్లను తప్ప ఎక్కువ మందిని ప్రలోభ పెట్టలేకపోయారు. అప్పుడే చంద్రబాబు నాయుడు హుందా రాజకీయాల మాట చెప్పారు.

కానీ రోజుల వ్యవధిలోనే ఆ హుందాతనం కాస్త మట్టి కలిసిపోయింది. ఎందుకంటే చిన్న చిన్న మునిసిపాలిటీ లలో కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి తెలుగుదేశంలో చేర్చుకోవడం ఆయా మునిసిపాలిటీపై తెలుగుదేశం జెండా ఎగరవేయడం చురుగ్గా చేపడుతున్నారు.

హిందూపురం తదితర మునిసిపాలిటీలు ఇప్పటికే చేతులు మారిపోయాయి. తాజాగా మాచర్ల మునిసిపాలిటీలో 16 మంది కౌన్సిలర్లు ఒకే రోజున తెలుగుదేశంలో చేరడంతో అక్కడ కూడా తెలుగుదేశం చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇంకా రాష్ట్రంలోని అనేక మునిసిపాలిటీలలో ఈ ఫిరాయింపుల రాజకీయాలకు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఏకంగా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల మున్సిపాలిటీని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరు మున్సిపాలిటీని కూడా దక్కించుకోవడానికి విఫలయత్నాలు చేశారు.

ముందే చెప్పుకున్నట్టు కుదిరితే ఫిరాయింపులు చేపట్టడం.. కుదరకపోతే హుందా రాజకీయాల పేరిట ఆదర్శాలను వల్లించడం చంద్రబాబు నాయుడు కొత్త అలవాటుగా మార్చుకున్నారా అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. ఇలాంటి ఫిరాయింపుల వలన పార్టీకి, ప్రభుత్వానికి తక్షణం వచ్చే లాభం ఏమీ లేదు గాని.. తమ రాజకీయ ప్రత్యర్థిని బలహీన పరచాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లుగా అర్థమవుతుంది.

10 Replies to “హుందా రాజకీయం అంటే ఇదేనా?”

  1. గ్రేట్ ఆంధ్రా అసలు మెయిన్ సీటే పోయిన తరువాత చిన్న చిన్న పదవులు ఉంటే ఎంత ఊడితే ఎంత అనుకోవాలి, జగన్ కంటే నీకు బాధ ఎక్కువైంది ఏమిటి. ఎప్పుడైనా చోటా నాయకులు అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం సహజం. డానికి విలువలు అనే పెద్ద పదాలు అనవసరం

  2. నువ్వు అయినా అదేపని చేస్తావు mental నా కొడకా. ఈ దేశం లో అందరూ అధికార పార్టీ వైపు ఉండటానికి ప్రయత్నం చేస్తారు.

  3. ఇదే టీడీపీ నించి వైసిపి కి వస్తె అది చంద్రబాబు కి దెబ్బ ఓటమి, జగన్ నిజాయితీ గెలుపు, జనాకర్షణ మహా మేత ఇలాంటి కూ. త. లు కూసే వాడివి. ఇపుడు రివర్స్ అయ్యే సరికి ఏడుపు రాతలు

Comments are closed.