ఇంద్ర రీ-రిలీజ్ లో అల్లు అర్జున్

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమా రీ-రిలీజ్ అయింది. మెగా బర్త్ డేని ఈ సినిమాతో సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన అభిమానులు. మరి ఈ సినిమాకు అల్లు అర్జున్ కు సంబంధం ఏంటి? Advertisement…

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇంద్ర సినిమా రీ-రిలీజ్ అయింది. మెగా బర్త్ డేని ఈ సినిమాతో సెలబ్రేట్ చేసుకున్నారు ఆయన అభిమానులు. మరి ఈ సినిమాకు అల్లు అర్జున్ కు సంబంధం ఏంటి?

ఇంద్ర సినిమాలో కీలక పాత్ర పోషించాడు శివాజీ. సినిమాలో చిరంజీవికి విధేయుడిగా ఉంటూనే, ఓ దశలో అతడికి యాంటీగా మారతాడు. ఒక విధంగా చెప్పాలంటే సినిమాలో చిరంజీవిని వెన్నుపోటు పొడిచే పాత్ర అది.

ఆ పాత్రతో అల్లు అర్జున్ ను పోలుస్తున్నారు మెగా ఫ్యాన్స్. సినిమాలో ఆ సన్నివేశం వచ్చినప్పుడు అల్లు అర్జున్ అంటూ ఫ్యాన్స్ అరుస్తూ గోల చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ మొత్తానికి బీజం ఓ సినిమా ఫంక్షన్ లో పడింది. ఆ ఫంక్షన్ కు ప్రత్యేక అతిథిగా హాజరైన అల్లు అర్జున్, రెండు కీలక వ్యాఖ్యలు చేశాడు. నాకిష్టమైతేనే వస్తా.. నా మనసుకు నచ్చితేనే వస్తా అంటూ ఓ కామెంట్ చేశాడు. ఇక హీరోను చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారని, తను మాత్రం ఫ్యాన్స్ ను చూసి హీరో అయ్యానంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

ఈ కామెంట్స్ కు కౌంటర్ గా ఇలా ఇంద్ర వీడియోను వాడుకుంటున్నారు మెగాభిమానులు. వీడియో వైర్ అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. చూస్తుంటే, మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కు మధ్య గ్యాప్ మరింత పెరిగినట్టు కనిపిస్తోంది.

6 Replies to “ఇంద్ర రీ-రిలీజ్ లో అల్లు అర్జున్”

  1. మరి ఈ లక్కీ ఛాన్స్ ను వాడుకోవా GA….. మన బన్నీ DP తో కొత్త PAYTM కుక్కల్ని తయారు చేయాల్సిన టైం వచ్చేసింది GA….😂😂

Comments are closed.