మళ్లీ ‘మా’ హేమ

నటి హేమను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను వేరు చేసి చూడలేం. అసోసియేషన్ ఎన్నికల టైమ్ లో హేమ చేసే హడావుడి స్పెషల్ ఎట్రాక్షన్. కొన్నేళ్ల నుంచి ఆమె అసోసియేషన్ ఎన్నికల్లో తన వంతు…

నటి హేమను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను వేరు చేసి చూడలేం. అసోసియేషన్ ఎన్నికల టైమ్ లో హేమ చేసే హడావుడి స్పెషల్ ఎట్రాక్షన్. కొన్నేళ్ల నుంచి ఆమె అసోసియేషన్ ఎన్నికల్లో తన వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారు. అలాంటి అసోసియేషన్ నుంచి హేమను సస్పెండ్ చేశారు.

దీనికి కారణం అందరికీ తెలిసిందే. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో హేమ నిందితురాలిగా ఉన్నారు. కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపి, బెయిల్ పై బయటకొచ్చారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆమెపై నిషేధం విధించింది అసోసియేషన్. ఆమె తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేంత వరకు సస్పెన్షన్ వేటు కొనసాగుతుందని ప్రకటించింది. దీంతో హేమ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

ఇవన్నీ జరిగి కొన్ని రోజులైంది. తాజాగా హేమ మరోసారి సోషల్ మీడియాలోకి వచ్చారు. డ్రగ్స్ పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు కొన్ని రిపోర్టుల్ని కూడా ఆమె బయటపెట్టారు. అదే టైమ్ లో కొంతమంది తనను బలిపశువును చేయడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించారని కూడా చెప్పుకొచ్చారు.

ఆమె వీడియో పెట్టిన 3 రోజులుకే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆమెపై నిషేధం ఎత్తేసింది. ఆమె మళ్లీ ‘మా’ సభ్యురాలు అంటూ ప్రకటించింది. అయితే మీడియాతో మాత్రం మాట్లాడొద్దనే కండిషన్ పెట్టింది అసోసియేషన్. దీనికి అంగీకరించిన హేమ.. ‘మా’కు కృతజ్ఞతలు తెలిపారు.

11 Replies to “మళ్లీ ‘మా’ హేమ”

Comments are closed.