శర్వానంద్ సెలెక్టెడ్ గానే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. నిత్యామీనన్ సంగతి చెప్పక్కరలేదు. ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్నసినిమా మళ్లీ మళ్లీ ఇది రాని రోజు. ప్రేమను, క్రీడను కలిపి, దర్శకుడు క్రాంతిమాధవ్ చేస్తున్న ప్రయోగం. శర్వానంద్ ఈ సినిమాలో రన్నర్ గా కనిపిస్తాడు.
పరుగుపందెం పోటీలు, ఆ వ్యవహారాలు సినిమాలో ఓ యాంగిల్ అయితే, మతాంతర ప్రేమ మరో యాంగిల్. ఈ సినిమాలో నిత్య గెటప్ చూస్తే హిందూ ముస్లిం ప్రేమ కథలా కనిపిస్తోంది. కాస్త మంచి ఆశయాలు, అయిడియాలు వున్న దర్శకుడు కాంతిమాధవ్ కు బహుశా ఇది తొలి కమర్షియల్ వెంచర్ కావచ్చు. ఎందుకంటే ఓనమాలు మంచి సినిమా అనపించుకుంది తప్ప, వాణిజ్యపరంగా సాధించింది తక్కువ.