స్పైడర్ కు రాజమౌళి సాయం

మురుగదాస్ స్టయిలే వేరు అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో, స్పైడర్ సినిమాకు రావాల్సిన బజ్ రావడం లేదు. పైగా తమిళ వెర్షన్ నే కీలకం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సినిమా ప్రమోషన్ లో కీలకమైన అడియో ఫంక్షన్…

మురుగదాస్ స్టయిలే వేరు అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో, స్పైడర్ సినిమాకు రావాల్సిన బజ్ రావడం లేదు. పైగా తమిళ వెర్షన్ నే కీలకం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో సినిమా ప్రమోషన్ లో కీలకమైన అడియో ఫంక్షన్ కు కూడా చెన్నయ్ నే వేదిక చేసేసారు. తెలుగు, తమిళ అడియోలు అక్కడే. దాని వల్ల లైవ్ కవరేజ్ కూడా లేదు. 

అందువల్ల కనీసం గెస్ట్ లతో అయినా బజ్ తీసుకువద్దామనుకున్నారు. మహేష్ కోసం తెలుగు టాప్ డైరక్టర్ రాజమౌళి గెస్ట్ గా రావడానికి ఓకె అన్నారు. సినిమా తమిళ వెర్షన్ హక్కు దారులు లైకా ప్రొడక్షన్ కోసం టాప్ డైరక్టర్ శంకర్ ఊ అన్నారు. సో, శంకర్, రాజమౌళి కలిసి స్పైడర్ కు బజ్ తీసుకువస్తారు. కానీ ఏం లాభం, ఫంక్షన్ జరిగేది చెన్నయ్ లో, బజ్ వచ్చేది తమిళ వెర్షన్ కు.

రిలీజ్ ముందు ప్రీ సక్సెస్ మీట్ వుండే వుండొచ్చు గాక, కానీ మళ్లీ రాజమౌళిని రమ్మంటే బాగుండదుగా? ఏ కొరటాల శివనో పిలవాలి. కానీ శంకర్-రాజమౌళి కాంబినేషన్ కు వుండే క్రేజ్ ఇక్కడ ఎలా వస్తుంది? ఎవరు తెస్తారు?