ఈసారి మహేష్ కు అన్నీ కలిసొచ్చాయి

స్పైడర్ సినిమా పోస్ట్ పోన్ అయిందని మొన్నటివరకు బాధపడ్డారు మహేష్ ఫ్యాన్స్. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు వాళ్లకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ లో స్పైడర్ సినిమా రిలీజ్…

స్పైడర్ సినిమా పోస్ట్ పోన్ అయిందని మొన్నటివరకు బాధపడ్డారు మహేష్ ఫ్యాన్స్. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు వాళ్లకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ లో స్పైడర్ సినిమా రిలీజ్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆగస్ట్ 9న మహేష్ బాబు కొత్త సినిమాను విడుదల చేస్తారట.

ఆ రోజుకు ఎంత ప్రత్యేకత ఉందో మహేష్ ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 9 మహేష్ బాబు పుట్టినరోజు. ఆరోజు స్పైడర్ సినిమా విడుదల అవుతుండడం నిజంగా విశేషమే. ఇప్పటివరకు మహేష్ నటించిన ఏ సినిమా, అతడి పుట్టినరోజు నాడు విడుదలకాలేదు. స్పైడర్ కు మాత్రమే ఆ ఘనత దక్కుతుంది. దీంతో పాటు మరో సెంటిమెంట్ యాంగిల్ కూడా ఇక్కడ మిక్స్ అయింది.

మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన శ్రీమంతుడు సినిమా ఆగస్ట్ లోనే విడుదలైంది. ఇప్పుడు స్పైడర్ మూవీ కూడా ఆగస్ట్ లోనే వస్తుండడంతో.. సెంటిమెంట్ ప్రకారం ఇది కూడా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.