శ్రీకారం చుట్టుకున్న ‘శర్వానంద్’

పాత్ర ఏదైనా అందులో అలా ఫిట్ అయిపోతాడు..ఒదిగిపోతాడు శర్వానంద్. అయితే అది పక్కా ఫీల్ గుడ్ మూవీ అయితే జనం ఓకె అంటారు. లేదూ రణరంగంలా మాస్ అంటే పక్కన పెడతారు. ఎందుకంటే శర్వానంద్…

పాత్ర ఏదైనా అందులో అలా ఫిట్ అయిపోతాడు..ఒదిగిపోతాడు శర్వానంద్. అయితే అది పక్కా ఫీల్ గుడ్ మూవీ అయితే జనం ఓకె అంటారు. లేదూ రణరంగంలా మాస్ అంటే పక్కన పెడతారు. ఎందుకంటే శర్వానంద్ బేసిక్ గా క్లాస్ టచ్ వున్న యంగ్ హీరో కనుక. శతమానం భవతి తరవాత మళ్లీ శర్వానంద్ కాస్త విలేజ్ బ్యాక్ డ్రాప్ వున్న సినిమా చేస్తున్నాడు. అదే 'శ్రీకారం'.

ఈ సినిమాను ముందుగా అయితే, సంక్రాంతికే తీసుకువద్దామని అనుకున్నారు. కానీ బోలెడు సినిమాలు వుండడంతో, ప్రశాంతంగా తరువాత వద్దామని ప్లాన్ చేసుకుని షూట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ విడుదల కు ఫిక్స్ చేసుకుని ఫస్ట్ లుక్ ఇచ్చారు. 

కలర్ ఫుల్ షర్ట్, లుంగీ ఎత్తి కట్టి, నల్ల తువ్వాలు భుజంపై వేసుకుని పొలాల్లో నడిచి వస్తున్న శర్వా లుక్ కూల్ గా వుంది. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈసినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ మాటలు అందిస్తున్నారు.

డబ్బులతో రాజకీయాలు చేసేవాళ్లం కాదు

'సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న' స్పెషల్ ఇంటర్వ్యూ