Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శ్రీలీలకు ముచ్చటగా మూడో సినిమా

శ్రీలీలకు ముచ్చటగా మూడో సినిమా

ఒకే బ్యానర్ లో ఒకే హీరోయిన్ మూడు సినిమాలకు సైన్ చేయడం అంటే సమ్ థింగ్ స్పెషల్ నే. పైగా మూడు సినిమాలు ఒకేసారి షూట్ లో వుండడం ఇంకా స్పెషల్. ఈ ఫీట్ ను సాధించింది శ్రీలీల. 

తొలి సినిమా పెళ్లి సందడి తో సినిమాల మీద సినిమాలు వచ్చి పడ్డాయి శ్రీలీలకు. ఆ సినిమా థియేటర్లలో ఓ మాదిరిగా ఆడింది. కానీ యూ ట్యూబ్ లో మాత్రం శ్రీలీల డ్యాన్స్ లు షేక్ చేసేసాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చి పడ్డాయి. ఏకంగా మలి చాన్స్ ను హీరో రవితేజ సరసనే అందుకుంది.

ఇలాంటి నేపథ్యంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ హీరో వైష్ణవ్ తేజ్ తో చేయబోయే సినిమాకు ఆమెను తీసుకుంది. ఆ సినిమా ఇంకా సెట్ మీదకు వెళ్లకుండానే నవీన్ పోలిశెట్టితో చేయబోయే సినిమాకు కూడా ఆమెనే ఫైనల్ చేసారు. ఈ రెండు సినిమాలు ఇలా వుండగానే, ఇప్పుడు మూడో సినిమాకు కూడా తీసుకోబోతున్నారు.

సిద్దు జొన్నలగడ్డ హీరోగా తయారు కాబోయే సీక్వెల్ డిజె టిల్లు 2 సినిమాకు హీరోయిన్ గా శ్రీలీల పేరు పరిశీలిస్తున్నారు. ఆమెకు కథ నెరేషన్ కూడా ఇచ్చేసారు. కానీ డేట్ ల సంగతి తేలాల్సి వుంది. ఏమాత్రం డేట్స్ అడ్జస్ట్ చేయగలిగినా ఒకే సంస్థలో ఒకేసారి షూటింగ్ జరుపుకుంటున్న మూడు సినిమాలలో, ముగ్గురు యంగ్ హీరోల సరసన శ్రీలీల నటిస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?