శ్రీకాంత్ చివరాఖరి ట్రయిల్?

మిడిల్ ఏజ్డ్ హీరోలకు టైమ్ అంత బాలేదు. నాగ్, బాలయ్య, వెంకీ లాంటి టాప్ స్టార్స్ ఏదో విదంగా మాంచి ప్రాజెక్టులు పట్టుకుని, సర్వైవ్ అవుతున్నారు.  శ్రీకాంత్ లాంటి స్టార్స్ కు సరైన ప్రాజెక్టలు…

మిడిల్ ఏజ్డ్ హీరోలకు టైమ్ అంత బాలేదు. నాగ్, బాలయ్య, వెంకీ లాంటి టాప్ స్టార్స్ ఏదో విదంగా మాంచి ప్రాజెక్టులు పట్టుకుని, సర్వైవ్ అవుతున్నారు.  శ్రీకాంత్ లాంటి స్టార్స్ కు సరైన ప్రాజెక్టలు పడక కిందా మీదా అవుతున్నారు. మిగిలిన  వారి సంగతి ఎలా వున్నా శ్రీకాంత్ పరిస్థితి మరీ దారుణం. హిట్ మాట సరే, సరైన మాంచి సినిమా చేసి చాలా కాలం అయింది.

ఇప్పుడు లేటెస్ట్ గా మరో సినిమా టీజర్ వదిలాడు. సినిమా పేరు రా..రా. అందరూ ట్రయ్ చేసి, అరగ్గొట్టేసిన హర్రర్ జోనర్ ను కాస్త ఆలస్యంగా అందుకున్నాడు శ్రీకాంత్. బూత్ బంగ్లా, అందులో దెయ్యం, దానితో బాధలు పడే బ్యాచ్. ఇవీ ఈ సినిమా ముడిసరుకులు.  కొత్త సరుకులు ఏమీ కావు. మరి వంటకం ఎలా చేసారో చూడాలి. ఈ జోనర్ కూడా ట్రయ్ చేసేస్తే, ఇక శ్రీకాంత్ కు మరేవీ మిగిలలేదేమో, ట్రయ్ చేయడానికి.