ఈ సినిమాకు స్పైడర్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలీదు కానీ ప్రస్తుతం నడుస్తున్న వ్యవహారాలు చూస్తుంటే సరిగ్గా పెట్టారనిపిస్తోంది. నిజంగానే మహేష్ ఇప్పుడు స్పైడర్ వెబ్ (సాలెగూడు)లో చిక్కుకున్నారు. బయటకు రాలేక, అందులోనే కొనసాగలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. నిజానికి ఈ సినిమాకు మహేష్ కేటాయించిన కాల్షీట్లు ఎప్పుడో అయిపోయాయి. క్వాలిటీ పేరుచెప్పి మరిన్ని కాల్షీట్లు సంపాదించారు.
చివరికి ఎలాగోలా ఆఖరి షెడ్యూల్ లోకి ఎంటరైతే ఇక్కడ కూడా మహేష్ కు మనశ్శాంతి లేకుండా పోయింది. వాస్తవానికి ఈ రోజుతో స్పైడర్ షూటింగ్ కంప్లీట్ అవ్వాలి. నిర్మాతలే ఈ విషయాన్ని చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్లో అలా జరగడం లేదు. బాహుబలి రేంజ్ లో గ్రాఫిక్స్ చూపించడం కోసం సీజీ వర్క్ పేరుచెప్పి మరోసారి మహేష్ ను ఆపేశారు. సో.. స్పైడర్ షూటింగ్ వచ్చే నెలలో కూడా కొనసాగుతుందన్నమాట.
జూన్ నెలలో 2 పాటలు మినహా యాక్షన్ పార్ట్ ఏదీ పెండింగ్ లో పెట్టకూడదని మహేష్ భావించాడు. అవసరమైతే ఓ వైపు పాటలు కంప్లీట్ చేస్తూనే మరోవైపు కొరటాల శివ సినిమా సెట్స్ పైకి వెళ్లాలని ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు స్పైడర్ యూనిట్ మరోసారి మహేష్ ను లాక్ చేసేసింది. గ్రాఫిక్స్ కోసం ప్రత్యేకంగా షూటింగ్ ప్లాన్ చేస్తోందట. తాజా పరిణామాల నేపథ్యంలో.. స్పైడర్ రిలీజ్ మరింత ఆలస్యం కావొచ్చని టాక్.