Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్ను రాత్రికి రమ్మన్నాడు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్ను రాత్రికి రమ్మన్నాడు

టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులపై ఇప్పటికే పలు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. త్వరలోనే మరింతమంది జాతకాలు బయటపెడతానని ప్రకటించింది. ఈసారి ఏ హీరో పేరు తెరపైకొస్తుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఆశ్చర్యకరంగా ఈసారి శ్రీరెడ్డి రూటుమార్చింది. 

తన కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్ని సినీపరిశ్రమ నుంచి రాజకీయాల వైపు మళ్లించింది శ్రీరెడ్డి. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన జీవన్ రెడ్డి అనే ఎమ్మెల్యే తనను వేధించాడని ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి. 

"ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు నన్ను వేధించారు. జీవన్ రెడ్డి వెనక మరికొంత మంది వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ వ్యక్తులు ఎవరనేది నాకుతెలీదు. కానీ జీవన్ రెడ్డి మాత్రం పెద్ద ఫ్రాడ్. నాలాంటి ఎంతోమంది మహిళల్ని ఎప్పటికప్పుడు పార్క్ హయత్ హోటల్ కు పిలుస్తుంటాడు.

ఈ వ్యవహారంలో నిర్మాత బెల్లంకొండ సురేష్ కూడా ఉన్నాడు. బెల్లంకొండకు నాకు కామన్ ఫ్రెండ్ ఉన్నారు. ఆమెను కలిసేందుకు నేను పార్క్ హయత్ హోటల్ కు వెళ్లాను. అప్పుడు అక్కడ జీవన్ రెడ్డి కూడా ఉన్నారు."

ఓ తమిళ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాల్ని బయటపెట్టింది శ్రీరెడ్డి. జీవన్ రెడ్డితో అదే తనకు తొలి పరిచయమని, మొదటి మీటింగ్ లోనే ఏవేవో మాట్లాడి, ఏకంగా తనను గదిలోకి రమ్మని పిలిచాడని ఆరోపించింది శ్రీరెడ్డి.

"తను కూడా స్లీపింగ్ ప్రొడ్యూసర్ నే అన్నారు జీవన్ రెడ్డి. సినిమాల్లో చాలా బ్లాక్ మనీ పెడుతుంటానని చెప్పారు. నేను చెబితే రామ్ చరణ్, ప్రభాస్ కూడా సినిమాలు చేస్తారని, ఎందుకంటే మేం రూలింగ్ లో ఉన్నాం అన్నారు. ఫేవర్ చేయమని అడిగారు. సర్, నాకు టైం కావాలని చెప్పాను. నేనేదో పతివ్రతను, వేరే వ్యక్తితో పడుకోను లాంటి డైలాగులు చెప్పలేదు. ఎందుకో ఆరోజు నేను అంత మూడ్ లో లేను."

అలా ఆ ఇబ్బందికర పరిస్థితి నుంచి తప్పించుకున్నానని చెబుతోంది శ్రీరెడ్డి. అయితే జీవన్ రెడ్డి మాత్రం తనకు తెలిసిన ఎంతోమంది మహిళల్ని వాడుకున్నాడని ఆరోపించింది. అతడికి అన్నీ పార్క్ హయత్ హోటల్ లోనే అని చెప్పుకొచ్చింది.

"ఇలా అవకాశాలు ఇస్తామనే రాజకీయ నాయకుల్ని మనం గుడ్డిగా నమ్మలేం. ఆ తర్వాత ఆయన చాలాసార్లు నాకు ఫోన్ చేశాడు. కానీ నేను వెళ్లలేదు. నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ చాలామంది జీవన్ రెడ్డి కోసం పార్క్ హయత్ కు వెళ్లారు. జీవన్ రెడ్డి అనే వ్యక్తి ఎంతోమంది మహిళల్ని వాడుకున్నాడు."

పార్క్ హయత్ హోటల్ లో ఇలాంటి పనుల కోసం జీవన్ రెడ్డి పర్మినెంట్ గా ఏకంగా ఓ గది తీసుకున్నారని, అతడి వద్ద తుపాకి కూడా ఉందని, తన ఎదుటే పబ్లిక్ గా జీవన్ రెడ్డి డ్రగ్స్ కూడా తీసుకున్నారని ఆరోపించింది శ్రీరెడ్డి. మీడియా, ఇంటెలిజెన్స్ చిత్తశుద్ధితో పనిచేస్తే పార్క్ హయత్ రాసలీలలు కుప్పలుతెప్పలుగా బయటకొస్తాయని అంటోంది.

సరిగ్గా ఎన్నికలకు ముందు జీవన్ రెడ్డిని ఇలా టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. ఈ ఆరోపణలపై టీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. మరోవైపు మహాకూటమికి ఇదో ఆయుధంగా మారే అవకాశంగా కూడా కనిపిస్తోంది. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు శ్రీరెడ్డి రూపంలో మరో అద్భుతమైన ఆయుధం దొరికింది. 

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?