వర్మకు దొరికిన ‘చంద్రబాబు’

మొత్తానికి చంద్రబాబు క్యారెక్టర్ కు ఆర్టిస్ట్ దొరికేసాడు. వాట్సప్ లో చలామణీ అయిన విడియో చూసి, డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఆ వ్యక్తి ఎవరో, ఎక్కడుంటాడో తెలిపితే, లక్ష రూపాయలు…

మొత్తానికి చంద్రబాబు క్యారెక్టర్ కు ఆర్టిస్ట్ దొరికేసాడు. వాట్సప్ లో చలామణీ అయిన విడియో చూసి, డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో ఆ వ్యక్తి ఎవరో, ఎక్కడుంటాడో తెలిపితే, లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి అచ్చం చంద్రబాబు నాయుడు మాదిరిగా వుండడంతో, తీసుకెళ్లి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో వేషం ఇవ్వాలన్నది వర్మ ఐడియా.

అయితే దీనీకి ట్విట్టర్ లో రోహిత్ అనే మీడియా పర్సన్ స్పందించి వివరాలు అందించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వర్మ నేరుగా ట్విట్టర్ లో ఖరారుచేసి, రోహిత్ కు థాంక్స్ చెప్పాడు. టైటిల్ కార్డ్స్ లో పేరు వేస్తా అని బ్యాంక్ డిటైల్స్ పంపిస్తే ఇస్తానన్న లక్ష రూపాయలు ఇస్తా అని ప్రకటించాడు.

అయితే రోహిత్ అనే వ్యక్తి దీన్ని సున్నితంగా తిరస్కరించారు. తనకు ఆ వ్యక్తి తెలుసు కనుక వివరాలు అందించా అని, లక్ష రూపాయల కోసం కాదని, ఆ మొత్తాన్ని ఆ మధ్య తెలంగాణలో జరిగిన బస్ ప్రమాద బాధితులకు అందించాలని పేర్కొన్నాడు. ఆ విధంగా రోహిత్ హీరో అయ్యాడు. 

మరి ఇంతకీ చంద్రబాబులా వున్న వ్యక్తి వివరాలు మాత్రం బయటకు వెళ్లడించలేదు. తెలిస్తే, ఎవరైనా అతన్ని దాచేస్తారనో? లేక, సినిమాలో వేయకుండా ఆపేస్తారనో భయం వుండి వుండొచ్చు.

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి