తొలిసారి తమిళ, మలయాళ వెర్షన్లపై సీరియస్ లుక్ పెట్టాడు మహేష్ బాబు. కానీ రిజల్ట్ వెరీ బ్యాడ్ గా వుంది. శ్రీమంతుడు తమిళ వెర్షన్ సెల్వందన్ గట్టిగా తొలివారం కోటి రూపాయిలు కూడా రాలేదని వినికిడి. అంటే బేసిక్ ఎక్స్ పెండిచర్ కూడా రికవరీ లేదన్నమాట.
మీడియా మీట్ లో నిర్మాత నవీన్ ను తమిళ వెర్షన్ కలెక్షన్ల మీద అడిగితే, ఆయన తడబడి..తేరుకుని, ఆపై తొలిసారి కదా..మహేష్ తమిళ మార్కెట్ మీద దృష్టి పెట్టడం, మలి సారి బాగుంటుంది అని సర్ది చెప్పారు.
నిజానికి శ్రీమంతుడు నూటికి తొంభై శాతం సబ్జెక్ట్ మీద కన్నా, మహేష్ చరిష్మా మీద ఆధారపడి తెలుగులో నెగ్గిన సినిమా. మరి తమిళ నాట ఆ చరిష్మా ను పక్కన పెట్టాల్సిందే. అప్పుడు అక్కడ మిగిలేది సబ్జెక్ట్ మాత్రమే. దత్తత తాలింపు పెట్టిన రివెంజ్ సబ్జెక్ట్ అక్కడి జనాలకు నచ్చలేదన్న మాట.