ఓవర్ సీస్ మార్కెట్ భలే చిత్రంగా వుంటుంది. కొందరికి అక్కడ హిట్ లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వసూళ్లు వుంటాయి. అలాంటి వాళ్లలో సూపర్ స్టార్ మహేష్ ఒకడు. అందుకే మహేష్ సినిమాలకు ఓవర్ సీస్ రేట్లు బాగానే వుంటాయి. అది ఇప్పుడు మరోసారి రుజువైందని తెలుస్తోంది.
మహేష్-కొరటాల శివ కాంబినేషన్ లో తయారైన సినిమా (శ్రీమంతుడు వర్కింగ్ టైటిల్) కు ఎనిమిది కోట్ల వరకు ఓవర్ సీస్ రైట్ల రూపంలో వచ్చిందని తెలుస్తోంది. కొరటాల శివ గత సినిమా వసూళ్లు, మహేష్ క్రేజ్ ను దృష్టి లో వుంచుకుని, ఈ రేటుకు సినిమాను ఓ కొత్త సంస్థ తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఎనిమిది కోట్లు హక్కులకు ఖర్చు చేసారంటే, వసూళ్లు కనీసం పన్నెండు కోట్లకు పైగా రావాలి. మరి శ్రీమంతుడు ఆ రేంజ్ కలెక్షన్లు సాధిస్తుందా అన్నది ఆసక్తికరమైన సంగతి.