త్రివిక్రమ్ తో అసోసియేట్ అయిన హారిక హాసిని సంస్థకు మహేష్ డేట్లు రెడీగా వున్నాయి. కొరటాల శివతో చేస్తున్న సినిమా తరువాత అడ్డాల శ్రీకాంత్ తో బ్రహ్మోత్సవం చేయాలా లేక, త్రివిక్రమ్ తో చేయాలా అని ఇన్నాళ్లు డైలామాలో వున్నాడట మహేష్. కానీ ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమా చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే ఇప్పటికిప్పుడు సినిమా మొదలుపెట్టడానికి త్రివిక్రమ్ సిద్ధంగా లేడని ఒక వెర్షన్ వినిపిస్తోంది. కనీసం ఆరు నెలలు దాటితే తప్ప, త్రివిక్రమ్ మళ్లీ సినిమాకు రెడీ కాడని అంటున్నారు. అప్పుడు కూడా డిస్కషన్లు అవీ మొదలెడితే మరో మూడు నెలలు పడుతుంది. అందుకే ఈలోగా శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేస్తాడని అంటున్నారు.