శ్రీనువైట్ల.. ఛలో అమెరికా

మిస్టర్ పరాజయం నుంచి తేరుకుని, మాంచి స్క్రిప్ట్ తో హీరో రవితేజను ఒప్పించి, మెప్పించి, సినిమాకు రెడీ అయిపోయారు దర్శకుడు శ్రీను వైట్ల. ఓ నావెల్ పాయింట్ తో రవితేజ మార్కు ఫన్ ఎంటర్…

మిస్టర్ పరాజయం నుంచి తేరుకుని, మాంచి స్క్రిప్ట్ తో హీరో రవితేజను ఒప్పించి, మెప్పించి, సినిమాకు రెడీ అయిపోయారు దర్శకుడు శ్రీను వైట్ల. ఓ నావెల్ పాయింట్ తో రవితేజ మార్కు ఫన్ ఎంటర్ టైనర్ కు లవ్, ఎమోషన్లను కలిపి కథ తయారుచేసుకున్నారు. హీరోగా మారిన సునీల్ మళ్లీ ఈ సినిమాతోనే ఫూర్తి స్థాయి కమెడియన్ గా చేయబోతున్నారు.

ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు వుంటారు. అయితే ఒకరే మెయిన్ హీరోయిన్. ఇప్పుడు వీళ్లకోసమే వెదుకులాట సాగుతోంది. ఆ వెదుకలాట అలా వుండగానే వచ్చే నెల రెండు వారాలకు పైగా ఓ షెడ్యూల్ ను అమెరికాలో చేసేందుకు రెడీ అయిపోతున్నారు. అయితే ఈ షెడ్యూల్ లో రవితేజ వుండడు. విలన్ ఎపిసోడ్ లు, హీరో చైల్డ్ హుడ్ ఎపిసోడ్ లు తీస్తారు.

వెనక్కు వచ్చాక హైదరాబాద్ లో ప్లాన్ చేసే షెడ్యూలులో రవితేజ పాల్లొంటారు. అప్పటికి రవితేజ ప్రస్తుతం చేస్తున్న కళ్యాణ్ కృష్ణ సినిమా చాలా వరకు పూర్తవుతుంది.