శృతిపై కేసు వాపస్?

శృతి హాసన్ కు పివిపి సంస్థకు నడుమ ముడి బిగుసుకుంది. కేసు కోర్టుకు వచ్చింది.అయితే ఇప్పడు ఈ కేసు ను వాపసు తీసుకునే దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. తెరవెనుక కమల్ మరి కొందరు…

శృతి హాసన్ కు పివిపి సంస్థకు నడుమ ముడి బిగుసుకుంది. కేసు కోర్టుకు వచ్చింది.అయితే ఇప్పడు ఈ కేసు ను వాపసు తీసుకునే దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. తెరవెనుక కమల్ మరి కొందరు ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు వినికిడి. 

నిజానికి తనకు అడ్వాన్స్ ఇవ్వలేదని, అగ్రిమెంట్ లేదని ఇలా రకరకాలుగా శృతి అన్నట్లు వార్తలు వినవచ్చాయి. పైగా కోర్టుకు కూడా శృతి లాయర్ కొన్ని విషయాలు చెప్పినట్లు వార్తలు వెలువడ్డాయి.అయితే ఇవన్నీ ఇలా వుంటే శృతికి పివిపి సంస్థకు నడుమ అగ్రిమెంట్ జరిగిదని తెలుస్తోంది. 

దీనికి సంబంధించిన డాక్యుమెంట్ ను శృతి స్వయంగా చెన్నయ్ లో నోటరీ చేయించినట్లు కూడా తెలుస్తోంది. ఇవన్నీ ఇలా వున్నా, కొందరి ప్రమేయంతో పివిపి మెత్తపడి శృతిపై కేసు వాపస్ తీసుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ విషయం ఒకటిరెండు రోజుల్లో తెలియచ్చు.