మెగా హీరోయిన్ నిహారిక కొణెదల నటించిన హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాకు సంబంధించి లేటెస్ట్ గాసిప్ ఇది. సుమంత్ అశ్విన్, నిహారిక హీరో హీరోయిన్లుగా హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. లక్ష్మణ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. అయితే నిజానికి ఇది సినిమా కాదని తెలుస్తోంది.
హ్యాపీ వెడ్డింగ్ టైటిల్ తో ఎప్పట్లానే వెబ్ సిరీస్ ప్లాన్ చేశారట. అప్పటికే నిహారిక-లక్ష్మణ్ కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవం ఉండడంతో.. హ్యాపీ వెడ్డింగ్ కూడా ఈజీగానే స్టార్ట్ అయింది. అయితే సెట్స్ పైకి వచ్చిన తర్వాత అవుట్ పుట్ చూసి దాన్ని సినిమాగా తీస్తే బాగుంటుందని యూవీ క్రియేషన్స్ నిర్మాతల్లో ఒకరైన ప్రమోద్ సూచించాడట.
అవసరమైతే తను నిర్మాణ సహకారం అందిస్తానని ప్రమోద్ చెప్పడంతో హ్యాపీ వెడ్డింగ్ వెబ్ సిరీస్ కాస్తా.. హ్యాపీ వెడ్డింగ్ సినిమాగా మారిందట. కేవలం కమిట్ అయ్యారు కాబట్టి యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై హ్యాపీ వెడ్డింగ్ సినిమాను నిర్మించారు. లేదంటే అలాంటి పెద్ద బ్యానర్ పై రావాల్సిన సినిమా కాదిది.
అతి తక్కువ బడ్జెట్ లో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ సినిమాకు ప్రస్తుతం యూనిట్ అంతా కలిసి ప్రచారం చేస్తోంది. ఇప్పటికే వెడ్డింగ్ ఇన్విటేషన్ పేరిట ట్రయిలర్ రిలీజ్ చేశారు. అది ఓ మోస్తరుగా ఉంది. ఈ నెలాఖరుకు థియేటర్లలోకి వస్తోంది హ్యాపీ వెడ్డింగ్ ది.