సరైన హిట్ లేక, గ్యాప్ తీసుకుని అలా వుండిపోయిన హీరో సుశాంత్. అతనితో రాహుల్ రవీంద్రన్ డైరక్షన్ లో తయారవుతున్న సినిమా చి.ల.సౌ. దీనికి సోషల్ మీడియాలో కాస్త బజ్ వచ్చింది. కొత్త నిర్మాతలకు నాలుగుకోట్ల వరకు ఖర్చు చేసిన తరవాత కాస్త అలుపు వచ్చినట్లు వినికిడి. ఇంకా మరికాస్త పెట్టుబడి పెట్టాల్సి వుంది. దీంతో మేనల్లుడి కోసం నాగార్జున రంగంలోకి దిగారు.
సినిమా స్క్రిప్ట్ చూసి, వర్క్ చూసి, దాన్ని మొత్తంగా తన చేతులలోకి తీసుకున్నారు. అవుట్ రేట్ గా వాళ్లు ఖర్చు పెట్టినది ఇచ్చేయడానికి, సినిమా మొత్తం నెగిటివ్ రైట్స్ అన్నపూర్ణ తీసుకోవడానికి డిసైడ్ అయింది. శాటిలైట్ కూడా అన్నపూర్ణదే. సినిమా ఫినిష్ చేసి, పబ్లిసిటీ ఖర్చుచేసి, విడుదల చేస్తారు. నాలుగు కోట్లు దాటి ఏమైనా వస్తే, అప్పుడు ఒరిజినల్ నిర్మాతలకు షేర్ ఇస్తారు. లేదంటే లేదు.
ఇదిలా వుంటే ఈ సినిమాను ఈనెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదేరోజు బెల్లంకొండ శ్రీనివాస్ సాక్ష్యం విడుదల వుంది. ఇంకా మరో ఒకటి రెండు చిన్న సినిమాలు కూడా వున్నాయి.