నా పేరు సూర్య తరువాత బన్నీ చేయబోయే సినిమాకు నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. శానం నాగ అశోక్ కుమార్, నల్లమలుపు బుజ్జిలకు కలిపి సినిమా చేయాలని డిసైడ్ అయింది. అయితే పేరు, బ్యానర్ లేకపోయినా, గీతాకు ఓ పార్ట్ వుంటుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వుంటుంది.
నా పేరు సూర్య సినిమానే నల్లమలపు బుజ్జి తీసుకువచ్చారు. కానీ తనకు నిర్మాతలు వుండడంతో, మరో సినిమా చేస్తానని బన్నీ మాట ఇచ్చాడు. అది ఇప్పుడు తీర్చుకుంటున్నాడు. అలాగే అల్లు అరవింద్ ఎప్పటి నుంచో శానం నాగ అశోక్ కుమార్ కు ఓ సినిమా ఇస్తానని చెఫుతున్నారు. అది కూడా ఇప్పుడు క్లియర్ అయింది.
సినిమాకు స్టార్ కాస్ట్, టెక్నీకల్ టీమ్ తదితర వ్యవహారాలపై డిస్కషన్లు స్టార్ట్ అయ్యాయి. ఒకటి రెండురోజుల్లో ఫైనల్ అవుతాయి. వెంటనే సెట్ మీదకు వెళ్లిపోవాలని బన్నీ డిసైడ్ అయినట్లు బోగట్టా.