హీరోయిన్‌గా చేస్తున్నప్పుడు మొదట్లో ఏమీ ఇబ్బంది వుండదు కానీ సక్సెస్ అయ్యాక అసలైన భయం మొదలవుతుందని చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్.
‘‘తెలుగులో నా తొలి సినిమా ‘వెంకటాద్రి’ ఎక్స్‌ప్రెస్ హిట్ అయ్యినప్పుడు అభినందనలతో మునిగి తేలాను. మరింత ఉత్సాహంగా పనిచెయ్యడానికి ప్రిపేరయ్యాను. గోపీచంద్‌తో చేసిన ‘లౌక్యం’ హిట్ అవ్వడం నిజంగా నా అదృష్టం. ఇప్పుడు అభినందనల పరంపరలో ఒక పక్క ఆనందం, మరోపక్క ఆందోళనతో ఇబ్బంది పడుతున్నాను. కారణం ఏంటంటే, ఈ సక్సెస్‌లు ఇలాగే కొనసాగుతాయా.? ఇప్పుడు నన్ను గోల్డెన్ లెగ్ అంటున్నవాళ్ళు పొరపాటున ఫెయిల్యూర్ వస్తే ఇంకేమంటారు.? ఇలాంటి భయం ఇప్పుడు నన్ను వెంటాడుతోంది. ప్రతి మ్యాచ్‌లోనూ ఇండియానే గెలుస్తుందని గ్యారంటీ ఏమిటి.? అలాంటిదే హీరోయిన్ లైఫ్ కూడా.. సక్సెస్‌లు వుంటే వరుసగా సినిమాలొస్తాయి. అది లేనప్పుడు అదే స్థాయిలో తగ్గిపోతాయి. నా వరకూ నేను పాత్రను పోషించడంలో పొరపాట్లు చేయను. ఇక సక్సెస్‌లంటారా.. అది ఒక్క హీరోయిన్ వల్ల కాదు. టీమ్ వర్క్ వల్లే సాధ్యం. నా ఫెయిత్ ఎలా వుంటుందో చూడాలి. నేను వర్క్‌ని నమ్ముతాను. ఆ పైన దేవుని కృప’’ అని సెలవిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్.