సుధీర్ కు మహేష్ పై అసంతృప్తి?

హీరో సుధీర్ బాబు..స్వయానా ఓ సూపర్ స్టార్ కు అల్లుడు..మరో సూపర్ స్టార్ కు బావ. కానీ బావ మహేష్ బావ సపోర్టు అంతగా లభించడం లేదని సుధీర్ బాధపడతున్నట్లు వినికిడి.  Advertisement ఎప్పుడో…

హీరో సుధీర్ బాబు..స్వయానా ఓ సూపర్ స్టార్ కు అల్లుడు..మరో సూపర్ స్టార్ కు బావ. కానీ బావ మహేష్ బావ సపోర్టు అంతగా లభించడం లేదని సుధీర్ బాధపడతున్నట్లు వినికిడి. 

ఎప్పుడో ఒకటీ అరా సందర్భాల్లో తప్ప, తనను కాస్త ఎంకరేజ్ చేయడం కానీ, ప్రమోట్ చేయడం కానీ మహేష్ చేయడం లేదన్న అసంతృప్తి సుధీర్ లో వుందని తెలుస్తోంది. ఇదే వైనాన్ని తన సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడినట్లు కూడా వినికిడి. 

సుధీర్ కు ప్రేమకథాచిత్రమ్ తరువాత సరైన హిట్ లేదు. కాస్త బాగా ప్రమోట్ చేసి వుంటే, మోసగాళ్లకు మోసగాడు ఓ వారం రోజుల పాటు మంచి కలెక్షన్లు రాబట్టుకునేదని, మహేష్ లాంటి హీరో ట్వీట్ చేసినా, బయటకు వచ్చినా వేరే విధంగా వుండేదని టాలీుడ్ టాక్.