సుధీర్ కొత్తగా ఏం చూపిస్తారు?

చెన్నయ్ సముద్ర తీరంలో, బలవంతంగా స్మగ్లింగ్ దిశగా అడుగులు వేసి, ఆయుధం పట్టినవాడు ఆయుధం తోనే మరణిస్తాడనే విధంగా ముగించిన సినిమా మణిరత్నం నాయకుడు. ఓ మాఫియా లీడర్ బయోపిక్ అంటే ఇంతకన్నా గొప్ప…

చెన్నయ్ సముద్ర తీరంలో, బలవంతంగా స్మగ్లింగ్ దిశగా అడుగులు వేసి, ఆయుధం పట్టినవాడు ఆయుధం తోనే మరణిస్తాడనే విధంగా ముగించిన సినిమా మణిరత్నం నాయకుడు. ఓ మాఫియా లీడర్ బయోపిక్ అంటే ఇంతకన్నా గొప్ప నిన్న-నేడు-రేపు మరే దర్శకుడు చెప్పలేడేమో? ఓ మాఫీయా నాయకుడి జీవితంలోని అన్ని పార్శ్వాలు టచ్ చేసేసాడు మణిరత్నం. ఎంతలా అంటే మరెవరు సినిమా చేసినా, అందులో నాయకుడి ఛాయలు కనిపించేలా?

ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు సుధీర్ వర్మ 'రణరంగం' సినిమా అందిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమాకు టైటిల్ దళపతి. అనివార్యకారణాల వల్ల టైటిల్ దొరకలేదు కానీ ఓ కుర్రాడి మాఫియా పయనానికి అదే సరైన టైటిల్ అయ్యేది. ఆ సంగతి అలావుంచితే, రణరంగం సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది.

మణిరత్నం నాయకుడి మాదిరిగా వృద్ధాప్యం వరకు వెళ్లలేదు. మిడ్ ఫార్టీల వరకే వెళ్లినట్లు కనిపిస్తోంది. యంగ్ శర్వా స్మగ్లింగ్ వ్యవహారాలు, మిడిల్ ఏజ్డ్ శర్వాను వెంటాడే పాత పగలు, రెండుచోట్లా రెండు ప్రేమలు ట్రయిలర్ లో కనిపించాయి. ట్రయిలర్ ను బట్టి చూస్తే ఇది ఓ మాఫియా లీడర్ బయోపిక్ అనేంత వుండదు అని కనిపిస్తోంది.

ఓ భగ్న ప్రేమికుడు కథను ఏ విధంగా అయితే రెండు ఏజ్ ల్లో చూపిస్తారో? అలా ఓ మాఫియా కథను చెప్పినట్లు కనిపిస్తోంది. అందవల్ల ఈ సినిమా జస్ట్ ఓ కుర్రాడి జీవితంలోని ట్వెంటీస్, ఫార్టీస్ అనే రెండు భాగాలను మాత్రమే ప్రెజెంట్ చేసే కథగా అనుకోవాలి. అంతేతప్ప నాయకుడు రేంజ్ మాఫియా లీడర్ బయోపిక్ అని అనుకోవడానికి లేదు.

ఈ విషయాలు అలావుంచితే ట్రయిలర్ లో టెక్నికల్ క్వాలిటీస్ సూపర్ గా వున్నాయి. సినిమాటోగ్రఫీ కానీ, నేపథ్య సంగీతం కానీ టాప్ గా వున్నాయి. శర్వా సంగతి సరేసరి. ఏదయినా మనసుపెట్టి చేసినట్లు వుంటుంది. మొత్తంమీద రణరంగం ట్రయిలర్ అందరినీ ఆకట్టుకునేలాగే వుంది.

తెలుగుదేశం.. ‘నో ప్లాన్’ వారి గేమ్ ప్లాన్