32 కోట్లతో ఎఫ్-2 సినిమాను నిర్మించారు నిర్మాత దిల్ రాజు. కొన్ని ఏరియాలు అమ్మేసి, డిజిటల్, శాటిలైట్ ఇచ్చేసి, తన మీద 8 కోట్ల బర్డెన్ వుంచుకున్నారు. ఆ బర్డెన్ కు బదులుగా దిల్ రాజుకు వచ్చిన షేర్ చూస్తే, కళ్లు జిగ్ మనాల్సిందే. నైజాం, కృష్ణ, వైజాగ్ ఏరియాలు దిల్ రాజు పంపిణీ చేసుకున్నారు స్వయంగా. గుంటూరును యువి ద్వారా పంపిణీ చేయించారు.
నైజాం, వైజాగ్, కృష్ణ ఏరియాలు కలిపి ఇప్పటికి వచ్చింది దగ్గర దగ్గర 29 కోట్లు. అంటే సినిమాకు నికరంగా ఇప్పటికి లాభమే 20 కోట్లు దాటేసింది అన్నమాట. గుంటూరు షేర్ ను కూడా లెక్కలోకి తీసుకుంటే పాతిక కోట్లకు దగ్గరలో వుంటుంది.
ఇప్పటికి వరల్డ్ వైడ్ గా దగ్గర దగ్గర 61 కోట్ల షేర్ వసూలు చేసింది ఎఫ్-2 సినిమా. ఈ వీకెండ్ ప్లస్ రిపబ్లిక్ డే సెలవులు వున్నాయి. ఇవన్నీ చూసుకుంటే సినిమా 70 కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే ప్రొడక్షన్ కాస్ట్ కు డబుల్ షేర్ అన్నమాట.
ఇదిలావుంటే 11వ రోజైన మంగళవారం కలెక్షన్లు ఇలా వున్నాయి.
నైజాం………….72లక్షలు
సీడెడ్………….24 లక్షలు
వైజాగ్.…………25 లక్షలు
ఈస్ట్ .………….21 లక్షలు
వెస్ట్.……………14 లక్షలు
నెల్లూరు…………6 లక్షలు
గుంటూరు ……..13 లక్షలు
కృష్ణ………………12 లక్షలు
తలసానిని కలిస్తే సస్పెండా? మరి పరిటాల పెళ్ళిలో సెల్ఫీలు దిగారే