Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మిస్ గ్రానీ.. బేబీ అయ్యింది

మిస్ గ్రానీ.. బేబీ అయ్యింది

సమంత రూత్ ఫ్రభు కాస్తా సమంత అక్కినేని అయిపోయిన తరువాత ట్రెండ్ మారిపొయింది. ఇప్పుడు ఆచితూచి సినిమాలు యాక్సెప్ట్ చేస్తోంది. హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత వున్న సినిమాలకే ఒకె అంటోంది. యుటర్న్ లాంటి డిఫరెంట్ సినిమా చేసాక, చైతూతో కలసి మజిలీ సినిమా చేస్తోంది.

ఈ సినిమాలో భర్తతో గిల్లి కజ్జాలు పెట్టకుంటూనే, భర్త లక్ష్యానికి సహకరించే పాత్రలో సమంత కనిపిస్తుంది. ఇక ఆ తరువాత శర్వానంద్ సరసన 96 మూవీకి ఓకె అంది. ఆ సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర చాలా కీలకం. ఇవికాక కొరియన్ మూవీ మిస్ గ్రానీ ఆధారంగా చేస్తే ఓ సినిమాకు ఓకె చెప్పిన సంగతి తెలిసిందే.

నందినీ రెడ్డి డైరక్షన్, నాగశౌర్య, ఇంకా మరో ఒకరిద్దరు చిన్న హీరోలు వున్నారు ఆ సినిమాలో. ఇప్పుడు సినిమాకు టైటిల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఓ బేబీ అనే టైటిల్, ఎంత సక్కంగున్నావే అన్నది ట్యాగ్ లైన్ అని వినిపించింది. కానీ జస్ట్ బేబీ అని టైటిల్ వుంచాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

ఓ బేబీ అనే కన్నా, బేబీ అని పెట్టి, కావాలంటే ట్యాగ్ లైన్ వాడుకోవచ్చని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కాస్త టిపికల్ గా వుంటుంది. పైకి యంగ్ గా కనిపించే ఓల్డ్ లేడీ క్యారెక్టర్ అది. అందుకే ఆ సినిమాకు బేబీ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మాంచి ఆప్ట్ టైటిల్ పట్టేసారు.

తలసానిని కలిస్తే సస్పెండా? మరి పరిటాల పెళ్ళిలో సెల్ఫీలు దిగారే

ఇండియన్ యూత్.. సెక్స్ కన్నా స్మార్ట్ ఫోనే ఇష్టం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?