Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సుజిత్ పై రామ్ కన్ను?

సుజిత్ పై రామ్ కన్ను?

రన్ రాజా రన్ సినిమాతో ఇండస్ట్రీ లుక్ ను తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు సుజిత్. అయితే ఈ సినిమా ఏ విధంగా వచ్చిందీ ముందే తెలుసుకున్న ఎనర్జిటిక్ హీరో రామ్ ఆ దర్శకుడితో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. ఈ మేరకు సినిమా విడుదలకు ముందే సుజిత్ కు కబురు అందిందని వినికిడి. 

అయితే ఇంకా సుజిత్ మాత్రం ఏమీ కమిట్ అవ్వలేదని, ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేసే పనిలోవున్నాడని తెలుస్తోంది. వాస్తవానికి, తనకు తొలి అవకాశం ఇచ్చిన యువి క్రియేషన్స్ కు మరో సినిమా కమిట్ మెంట్ వుంది. అన్నీ బాగుంటే, అది బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా వుండే అవకాశం వుంది. అదే కనుక నిజమైతే, రామ్  కోరిక ఇప్పట్లో నెరవేరదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?