Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సుకుమార్-బన్నీ మరోసారి?

సుకుమార్-బన్నీ మరోసారి?

సుకుమార్-బన్నీ అనగానే ఆర్య సినిమా గుర్తుకు వస్తుంది. చాలా కాలం అయింది ఆ కాంబినేషన్ చూసి. ఇప్పడు ఆ కాంబినేషన్ సెట్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

ప్రస్తుతం సుకుమార్ చేసిన రంగస్థలం సినిమా పూర్తయ్యింది. మరో పది రోజుల్లో విడుదల కాబోతోంది. సుకుమార్ ముందు అడ్వాన్స్ లు వున్నాయి కానీ కమిట్ మెంట్ లు ఏవీ లేవు.

తరువాత సినిమాను కూడా మైత్రీ మూవీస్ కే చేయాలి. మైత్రీ మూవీస్ సంస్థకు బన్నీతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక. ఒకటి రెండు సార్లు బన్నీని అప్రోచ్ అయ్యారు కూడా. సరైన ప్రాజెక్టు పడడం లేదు. ఈ మధ్య అల్లు అరవింద్ తో ఒకటికి రెండు సార్లు మైత్రీ నిర్మాతలు కలవాల్సి వచ్చింది.

రంగస్థలం పనులు, అలాగే వైజాగ్ లో ఫంక్షన్ కు పిలవడం ఇలా. ఆ టైమ్ లో మళ్లీ ఈ విషయం కదిలింది. దాంతో బన్నీని కలిసి మాట్లాడమని అరవింద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రంగస్థలం పనుల్లో మైత్రీ జనాలు, నా పేరు సూర్య పనుల్లో బన్నీ బిజీగా వున్నారు.

రంగస్థలం విడుదల తరువాత ఓ సిటింగ్ పడే అవకాశం వుంది. రంగస్థలం హిట్ అయితే బన్నీ-సుకుమార్ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశం కూడా వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?