సుకుమార్ ఏం చేసేస్తున్నాడో?

రంగస్థలం 1985 అంటూ పాతిక ముఫై ఏళ్ల కిందటి ముచ్చట్లు తెరపైకి తెస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఆ మధ్య ఇలాంటి పోస్టర్ ఒకటి వదిలారు బయటకు. నిజానికి ఇలాంటి విషయాలు ఫేస్ బుక్ లో…

రంగస్థలం 1985 అంటూ పాతిక ముఫై ఏళ్ల కిందటి ముచ్చట్లు తెరపైకి తెస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఆ మధ్య ఇలాంటి పోస్టర్ ఒకటి వదిలారు బయటకు. నిజానికి ఇలాంటి విషయాలు ఫేస్ బుక్ లో తరచు చలామణీ అవుతుంటాయి. గోళీ కాయలు, పిక్క సోడాలు, ఇలా అలనాటి మధుర స్మతులను నెమరు వేసుకుంటూ. అందువల్ల అలాంటివి నచ్చేవారికి ఆ పోస్టర్ బాగానే నచ్చింది.

తాజగా యూనిట్ జనాలు మరో ఫోటో ఒకటి బయటకు వదిలారు సోషల్ నెట్ వర్క్ లో. రకరకాల పగటి వేషాలు, పౌరాణిక వేషాలు, పులివేషాలు వేసుకున్న జనాల ఫోటో అది. కోస్తా జిల్లాల పల్లెటూళ్లలో ఇప్పటికీ జాతరలకు ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. అంటే రంగస్థలంలో 1985 నాటి జాతరలను కూడా చూపిస్తున్నట్లు అనకోవాల్సి వస్తోంది. 

మరీ నోస్టాల్జియా వ్యవహారాలు ఎక్కువైపోతే ఎలా వుంటుందో? సుకుమార్ డైరక్షన్ మీద, అభిరుచి మీద సందేహం అక్కరలేదు. కానీ అలా అని మరీ తన అభిరుచి, తనకు నచ్చినవే కాకుండా, సాధారణ ప్రేక్షకులను కూడా కాస్త ముందు వెనుక చూసుకుంటూ వెళ్తే బెటరేమో? సుకుమార్. అయితే ఈ విషయంలో మైత్రీ మూవీస్ జనాలు నిశ్చింతగా వున్నారట. సినిమాలో ఎమోషన్లు పీక్స్ లో వుంటాయని, అందువల్ల సినిమా సూపర్ గా వస్తోందని అంటున్నారు యూనిట్ జనాలు. అలా అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ కు జాతరే.