సుకుమార్ మదిలో రోహిత్?

రంగస్థలం తరువాత సదీర్ఘ గ్యాప్ తీసకుని దర్శకుడు సుకుమార్ చేస్తున్న సినిమా పుష్ప. మహేష్ బాబు మీదుగా బన్నీ దగ్గరకు చేరింది ఎర్రచందనం స్మగ్లింగ్ కథ. కరోనా కల్లోలం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నవంబర్…

రంగస్థలం తరువాత సదీర్ఘ గ్యాప్ తీసకుని దర్శకుడు సుకుమార్ చేస్తున్న సినిమా పుష్ప. మహేష్ బాబు మీదుగా బన్నీ దగ్గరకు చేరింది ఎర్రచందనం స్మగ్లింగ్ కథ. కరోనా కల్లోలం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నవంబర్ నుంచి పుష్ప సినిమా సెట్ మీదకు వెళ్తుందని బోగట్టా. 

ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కు మొదట్లో విజయ్ సేతుపతిని అడిగారు. ఆయన చేస్తాను అన్నాడు కానీ ఒకటే కండిషన్. ఈ సినిమాను తమిళనాట విడుదల చేయకూడదు. కానీ అది వర్కవుట్ అయ్యే వ్యవహారం కాదు కనుక ఆ విషయం ఇక మరిచిపోయారు. తరువాత మార్చిలో ఇదే విషయమై హీరో నారా రోహిత్ ను నేరుగా సుకుమార్ నే సంప్రదించినట్లు తెలుస్తోంది. కథ నెరేషన్ కూడా ఇచ్చారు. రోహిత్ కు క్యారెక్టర్ నచ్చింది.  సై అన్నారు. 

ఇదంతా జరిగింది కరోనా కు ముందు/ అప్పటి లెక్కల  ప్రకారం నవంబర్ నాటికి పుష్ప సినిమా ప్రొడక్షన్ దాదాపు అయిపోతుంది. కానీ కరోనా వచ్చి మొత్తం మార్చేసింది. కరోనా సమస్య వచ్చిన దగ్గర నుంచి సుకుమార్ ఎవ్వరితోనూ టచ్ లో లేరు. అందువల్ల మరి అప్పటి నుంచి మళ్లీ నారా రోహిత్ తో మాట్లాడలేదు. మరి ఇఫ్పటికీ సుకుమార్ అదే ఐడియాతోనే వున్నారా? రొహిత్ కూడా రెడీగానే వున్నారా? అన్న రెండు ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి వుంది.

ఎందుకంటే రోహిత్ కు నవంబర్ నుంచి హీరోగా ఒకటి రెండు సినిమాలు స్టార్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ కూడా మార్చి తరువాత మళ్లీ ఎందుకు రోహిత్ ను సంప్రదించలేదు అన్నది కూడా తెలియాలి.

సినిమా రివ్యూ: వి