సుకుమార్ పై త్రివిక్రమ్ ఎఫెక్ట్?

అల వైకుంఠపురంలో సినిమా వచ్చేసింది. బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇక ఇప్పుడు తరవాత ఏంటీ అన్నది ఫ్యాన్స్ ఆలోచన.  సుకుమార్-బన్నీ సినిమా మీదే వుంది ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టి. బన్నీ కూడా ఇప్పుడు ఈ…

అల వైకుంఠపురంలో సినిమా వచ్చేసింది. బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇక ఇప్పుడు తరవాత ఏంటీ అన్నది ఫ్యాన్స్ ఆలోచన.  సుకుమార్-బన్నీ సినిమా మీదే వుంది ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టి. బన్నీ కూడా ఇప్పుడు ఈ సినిమా మేకింగ్ మీద దృష్టి పెట్టబోతున్నట్లు బోగట్టా.

అల వైకుంఠపురములో సినిమా క్లాస్ గా, స్టయిల్ గా రూపొందింది. కానీ సుకుమార్ చేయబోయే శేషాచలం (వర్కింగ్ టైటిల్) అలా కాదు. పక్కా రా అండ్ రఫ్ సినిమా. ఈ సినిమాలో బన్నీ గెటప్ కూడా అలాగే వుంటుంది. లుంగీ, కాస్త ఎక్కువ గెడ్డం ఇలా పరమ నాటుగా.

అయితే ఇప్పుడు దీని మీదే మళ్లీ పునరాలోచన సాగుతోందని బోగట్టా. మన్నీ రఫ్ గా నటించిన నా పేరు సూర్య‌ పరమ డిజాస్టర్ గా మిగిలింది. బన్నీ స్టయిల్ గా నటించిన సినిమాలే ఎక్కువగా హిట్ అయ్యాయి. అందుకే మరీ నాటుగా కాకుండా కాస్త పాలిష్ చేసే ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది.

అల వైకుంఠపురములో సినిమా తరువాత వస్తున్న ఫీడ్ బ్యాక్ మేరకు సుకుమార్ సినిమా స్క్రిప్ట్ కు త్వరలో రిపేర్లు ప్రారంభం అవుతాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

బిగ్ స్టోరి:తెర తొలిగింది