మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు మెమరబుల్ సినిమా రంగస్థలం. అలాంటి సినిమా ఇచ్చిన డైరక్టర్ సుకుమార్. ఆయన కూడా మెగామూవీ సైరా ఈవెంట్ లో కనిపించలేదు. మెగాస్టార్ 150వ సినిమా డైరక్టర్ వినాయక్, 152వ సినిమా కొరటాల శివ వచ్చారు. రామ్ చరణ్ లేటెస్ట్ సినిమా ఆర్.ఆర్.ఆర్ డైరక్టర్ రాజమౌళి వచ్చారు. కానీ సుకుమార్ రాలేదు.
పిలిస్తే రాకుండా వుండడానికి అవకాశం తక్కువ. అందునా సుకుమార్ ప్రస్తుతం సిటీలోనే స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ వున్నారు. రంగస్థలం లాంటి సినిమా ఇచ్చిన సుకుమార్ ను రామ్ చరణ్ మరిచిపోయాడా? లేక బన్నీ క్యాంప్ జనాలను, దూరం పెడుతున్నట్లు సుకుమార్ ను కూడా వదిలేసాడా?
ఎలా చూసుకున్నా, ఎటు చూసుకున్నా, గీతాక్యాంప్ కు, కొణిదెల క్యాంప్ కు మధ్య దూరం పెరుగుతూనే వున్నట్లు కనిపిస్తోంది. ఈ లెక్కన అల్లు అరవింద్ నిర్మాణంలో మెగాస్టార్ సినిమా వుంటుందా? అన్నది అనుమానమే. వాస్తవానికి 152వ సినిమా తనదే అనే గతంలో అరవింద్ ప్రకటించారు. కానీ అది కూడా ఇప్పుడులేదు. 153 వ సినిమా అయినా వుంటుందో వుండదో?